Best smartphone under 10000 : 10వేల ధరలోపే ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్.. మిస్ అవ్వకండి..
Poco M6 Plus price drop : ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,000 లోపు ధరకు పోకో ఎం6 ప్లస్ పొందండి. అన్ని బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? కానీ దానికి తగిన బడ్జెట్ లేదా? నిరాశపడకండి! ఈ మధ్య కాలంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ కూడా అనేక ఆసక్తికర ఫీచర్స్‌తో వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి పోకో ఎం6 ప్లస్. ఇక ఇప్పుడు, ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఫలితంగా రూ. 10వేల లోపు ధరలోనే మంచి ఫీచర్ లోడెడ్ స్మార్ట్‌ఫోన్ కొనే ఛాన్స్ మీకు ఉంది. ఈ నేపథ్యంలో పోకో ఎం6 ప్లస్‌పై ఉన్న ఆఫర్స్, డిస్కౌంట్స్ వివరాలను ఇక్కడ చూసేయండి..
డిస్కౌంట్లు, ఆఫర్లు..
పోకో ఎం6 ప్లస్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.15,999. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.114999కే కొనుగోలు చేయవచ్చు! ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై 28% భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
అంతే కాదు.. ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గించడానికి బ్యాంక్స ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలను కూడా అందుబాటులో ఉన్నాయి! అందువల్ల, కొనుగోలుదారులు రూ.5000స అంతకంటే ఎక్కువ ఆర్డర్లపై ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1250 వరకు 10% తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
చివరిగా కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. పోకో ఎం 6 ప్లస్‌పై రూ .10400 వరకు తగ్గింపు పొందవచ్చు. అందువల్ల, ఈ స్మార్ట్‌ఫోన్‌ని రూ.10,000 లోపు కొనుగోలు చేయవచ్చు. ఇది కొనుగోలుదారులకు సూపర్ డీల్ అనే చెప్పుకోవాలి. దాాదాపు 6వేలు ఆదా చేసుకోవచ్చు.
పోకో ఎం 6 ప్లస్ ఎందుకు కొనాలి?
పోకో ఎం6 ప్లస్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 6.79 ఇంచ్ అడాప్టివ్ సింక్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. పోకో ఎం6 ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3 ఎక్స్ ఇన్-సెన్సార్ జూమ్ ఉన్నాయి. 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5030 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. షియోమీ హైపర్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్లో ఏఐ నైట్ మోడ్ వంటి పలు అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అందువల్ల ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేస్తే రూ.10,000 లోపు విలువైన స్మార్ట్‌ఫోన్ ఇది.
సంబంధిత కథనం