తెలుగు న్యూస్ / ఫోటో /
Coastal Karnataka Tour : ఇయర్ ఎండ్‌లో ట్రిప్ ప్లాన్ ఉందా...! హైదరాబాద్ నుంచి కర్ణాటకకు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ
- IRCTC Hyderabad Coastal Karnataka Tour : ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్లాలనుకుంటున్నారా...? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక ప్రాంతాలోని పలు టూరిస్ట్ ప్లేసులను చూపించనుంది. ఇందులో మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు.
- IRCTC Hyderabad Coastal Karnataka Tour : ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ వెళ్లాలనుకుంటున్నారా...? మీకోసం IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక ప్రాంతాలోని పలు టూరిస్ట్ ప్లేసులను చూపించనుంది. ఇందులో మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు.
(1 / 9)
2024 ఏడాది పూర్తి కావొస్తోంది. అయితే ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే… మీకోసం మంచి ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది IRCTC టూరిజం, ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.(image source unsplash.com)
(2 / 9)
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ట్రైన్ జర్నీ ఉంటుంది. మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.(image source unsplash.com)
(3 / 9)
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం డిసెంబర్ 17, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.(image source unsplash.com)
(4 / 9)
మొదటి రోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 రైలు(Train No.12789) బయల్దేరుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. 2 రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి ఉడిపికి వెళ్తారు. దగ్గర్లో ఉండే శ్రీ కృష్ణ టెంపుల్ తో పాటు Malpeబీచ్ కు వెళ్తారు. రాత్రి ఉడిపిలోనే ఉంటారు. 3వ రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తారు. ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు బయల్దేరుతారు. అక్కడ ఉండే బీచ్ లను చూస్తారు. రాత్రి మళ్లీ ఉడిపికి చేరుతారు.(image source unsplash.com)
(5 / 9)
4వ రోజు Hornadu కు చేరుకుంటారు. Annapororna ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శృంగేరికి వెళ్తారు. శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు బయల్దేరుతారు. రాత్రి ఇక్కడే ఉంటారు. 5వ రోజు మంగళూరుకు చేరుకుంటారు. మంగళాదేవీ ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం Tannerbhavi Beach, గోకర్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 7 గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 08.5 గంటలకు జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు రాత్రి 11.40కి కాచిగూడకు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.(image source unsplash.com)
(6 / 9)
హైదరాబాద్ - కర్ణాటక టూర్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39,140ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22,710 ధరగా ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18,180గా ఉంది. కంఫర్ట్ క్లాస్ 3Aలో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15,150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36,120గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 19,690గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా వేర్వురు టికెట్ ధరలు నిర్ణయించారు.(image source unsplash.com)
(7 / 9)
ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.(image source unsplash.com)
(8 / 9)
హైదరాబాద్ - కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085 (image source unsplash.com)
ఇతర గ్యాలరీలు