Keerthy Suresh wedding: కీర్తి సురేష్ పెళ్లి వేడుకలు షురూ.. ఫొటోతో హింట్ వదిలిన హీరోయిన్
Keerthy Suresh wedding: దశాబ్దకాలం పాటు తన చిన్ననాటి స్నేహితుడితో గోప్యంగా ప్రేమాయణం నడిపిన కీర్తి సురేశ్.. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోబోతోంది. పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ.. జరగనుందంటే?
సీనియర్ హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతోంది. డిసెంబరు 12న గోవా వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. దాంతో ఈరోజు నుంచే పెళ్లి వేడుకలు మొదలవగా.. కీర్తి సురేశ్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఈ మేరకు సంకేతాలు ఇచ్చింది.
గోవాలో పెళ్లి
ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్.. తాను ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ధ్రువీకరించిన విషయం తెలిసిందే. వారం క్రితం కీర్తి సురేశ్ వెడ్డింగ్ కార్డు కూడా బయటికి వచ్చింది. అందులో డిసెంబరు 12న గోవాలో వివాహం జరగబోతున్నట్లు ఉంది.
తొలుత క్రిస్టియన్ పద్ధతిలో ఆంటోనీ తాటిల్, కీర్తి సురేశ్ పెళ్లి జరగనుండగా.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలో జరగనుంది. 2017లో సమంత, నాగచైతన్య కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారు. దశాబ్దకాలం పైగా ఆంటోనీ తాటిల్‌తో గోప్యంగా కీర్తి సురేశ్ ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి ఈ పెళ్లి చేసుకుంటోంది.
పెళ్లికి ముందు సంగీత్‌కి రెడీ అవుతున్నట్లు కీర్తి సురేశ్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ధరించిన గౌనుపై 'కిట్టి' అని రాసి ఉండగా.. ఇక్కడి నుంచి మొదలు అని కూడా అందులో అంటూ కీర్తి సురేశ్ హింట్ ఇచచింది.
బాలీవుడ్‌లో కీర్తి సినిమాలు
గోవాలోని వివాహ వేదిక వద్దకి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నూతన వధూవరులు ఇప్పటికే గోవాకి చేరుకున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తాటిల్‌తో తన ప్రేమ విషయాన్ని అభిమానులకి కీర్తి సురేశ్ తెలియజేసింది. సౌత్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న కీర్తి.. బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన బేబీ జాన్ మూవీ త్వరలోనే విడుదలకానుంది.