Kharmas 2024: ఖర్మలు అంటే ఏంటి..? ఈ సారి ఖర్మలు ఎప్పటి నుంచి ఎప్పుటి వరకూ ఉన్నాయి?
Kharmas 2024: ఖర్మలు లేదా ఖర్మాస్ అంటే పాపకాలమని హిందువులు నమ్ముతారు. ఈ రోజుల్లో శుభకార్యాలు చేయకూడదని నమ్మిక. ఈ సారి ఖర్మలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమేం చేయకూడదు అనే విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
హిందూ ఆచారాల వ్యవహారాల్లో ఖర్మాస్(ఖర్మలు లేదా కర్మలు)లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజుల్లో భక్తులు శ్రీమహావిష్ణువును, సూర్యభగవానుడిని పూజించడం వల్ల జీవితం సుఖసంతోషాలతో నిండుతుంది. అలాగే ఖర్మ సమయంలో కొన్ని రకాల పవిత్రమైన, శుభప్రదమైన పనులు చేయడం అశుభమని, అనారోగ్యానికి కారణమని కూడా పురాణాలు చెబుతున్నాయి. అసలు ఖర్మలు అంటే ఏంట? ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదతో తెలుసుకుందాం.
ఖర్మాస్ అనే పదం కర్మ సిద్దాంతం నుంచి ఉద్భవించింది. కర్మ అంటే మనం చేసిన చర్యలు, వాఠి ఫలితాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖర్మాస్ అంటే దారుణమైన లేదా ప్రతికూలమైన కర్మలు కలగకుండా జీవితంలో పుణ్యం, శాంతిని పొందేందుకు అనువైన సమయం. ఇవి 30 రోజుల పాటు ఉంటాయి. సూర్యుడు ధనస్సు లేదా మీన రాశిలో ప్రవేశించినప్పుడు ఇవి మొదలవుతాయి.
ఖర్మలు ఈ సారి ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ?
ద్రిక్ పంచాంగం ప్రకారం ఈ సారి డిసెంబర్ 15న 10:19 గంటలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ సారి ఖర్మలు డిసెంబర్ 15 న ప్రారంభమై జనవరి 14న ముగుస్తాయి.
ఖర్మల్లో శుభకార్యాలు, పెళ్లిళ్లను ఎందుకు నిలిపివేస్తారు?
1. జ్యోతిష్యశాస్త్ర పద్ధతులు:
జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడు వ్యక్తుల జీవితాన్ని శాషించే శక్తివంతమైన గ్రహం. అయితే ఖర్మాస్ సమయంలో సూర్యుడు ధనస్సు లేదా మీన రాశుల్లో సంచరిస్తున్నప్పడు కొత్త లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించడం అనుకూలంమైన రోజులు కావు. ఈ సమయంలో సూర్యుని శక్తి తక్కువగా ఉండి, కొత్త ప్రారంభాలకు అంగీకరించి శక్తిని ఇవ్వలేడని నమ్ముతారు. అందుకే ఈ సమయంలో పుణ్య, శుభ కార్యాలు తలపెట్టకూడదు.
2. ఆత్మవిమర్శన సమయం:
ఖర్మాస్ ఒక ఆధ్యాత్మిక అన్వేషణ, ఆత్మవిమర్శన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో, భక్తులు ప్రార్థనలు, తపస్సులు, పూజలలో నిమగ్నమవుతారు. ఇది దైవ సేవలో పాల్గొనడం, పదార్థిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయడం కోసం అనుకూల సమయం.
3. అనుకూల ఫలితాలు రాకపోవడం:
ఖర్మాస్ సమయంలో కొత్త కార్యకలాపాలు ప్రారంభిస్తే అవి అనుకూల ఫలితాలను ఇవ్వవు. అంతేకాదు అవి విఫలమయ్యే అవకాశం ఎక్కువనే భావన కూడా ఉంది. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశ కార్యక్రమాలు వంటి ఇతర ముఖ్యమైన జీవిత కార్యక్రమాలు ఈ సమయంలో నిర్వహించకూడదు.
4. దైవ సమయాన్ని గౌరవించడం:
హిందూ సంప్రదాయంలో సమయం చక్రికంగా ఉంటుందని భావిస్తారు. కొన్ని కాలాలు ఆధ్యాత్మికంగా మరింత శక్తివంతమైనవి అవుతాయి. ఖర్మాస్ సమయం కొత్త జీవితకాలాలను ప్రారంభించడానికి అనుకూలంగా ఉండదు. ఈ సమయాన్ని గౌరవించి, భక్తులు తమ చర్యలను కోస్మిక్ శక్తులతో సమన్వయంగా కొనసాగించేందుకు ఈ సమయాన్ని పురస్కరించుకుంటారు.
5. సాంస్కృతిక, మతపరమైన ప్రవర్తనలు:
హిందూ నమ్మకాల ప్రకారం ఈ సమయం ఆధ్యాత్మిక అభ్యాసం, ఉపవాసం, పూజలలో పాల్గొనడానికే ఉత్తమ సమయం. అంతేకానీ సామాజిక లేదా ఉత్సవ కార్యక్రమాలను జరుపుకోవడానికి కాదు.
చేయకూడని పనులు:
పెళ్లిల్లు, నిశ్చితార్థాలు, గృహప్రవేశం, కొత్త వెంచర్లు ప్రారంభించడం, ఆస్తులను కొనుగోలు చేయడం వంటి పనులు చేయకూడదు. అలాగే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం వంటివి కూడా చేయకూడదు.
చేయాల్సిన పనులు:
పవిత్రనదుల్లో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధి కలిగి, పాపాలు తొలగిపోతాయి.
దీపదానాలు చేయడం వల్ల ఆధ్యాత్మిక యోగ్యత, పుణ్యం కలుగుతాయి.
అన్నదానం, బట్టలు, బంగారం వింటివి దానం చేయడం వల్ల మంచి కర్మ, శ్రేయస్సు లభిస్తాయి.
ఉపనయంన, కర్ణవేదం వంట ఆచారాలు ఈ సమయంలో శుభప్రదమైనవి.
ఖర్మ సమయాల్లో ఆరాధన, ఉపవాసం వంటివి చేయడం వల్ల ఆధ్మాత్మిక సంబంధం, క్రమశిక్షణ బలపడతాయి.