Tulsi mala: శ్రీకృష్ణుడు భక్తులు తులసి మాల ఎందుకు ధరిస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?-why lord krishna devotees wear tulsi mala what are the health benefits of tulsi mala ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Tulsi Mala: శ్రీకృష్ణుడు భక్తులు తులసి మాల ఎందుకు ధరిస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?

Tulsi mala: శ్రీకృష్ణుడు భక్తులు తులసి మాల ఎందుకు ధరిస్తారు? దీని ప్రత్యేకత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Dec 20, 2023 10:49 AM IST

Tulsi mala: తులసి మాల చేతిలో పట్టుకుని ధ్యానం చేస్తూ మంత్రాలు జపిస్తారు. తులసి మాల ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

తులసి మాల ఎందుకంత ప్రత్యేకం
తులసి మాల ఎందుకంత ప్రత్యేకం (unsplash)

Tulsi mala: తులసి ఎంతో పవిత్రమైనది. హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. తులసితో పూజ చేస్తే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలని తులసి అందిస్తుంది.

మహిళలు ప్రతిరోజూ తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపం పెట్టి పూజ చేస్తారు. శ్రీకృష్ణుని భక్తులు చాలా మంది తులసి మాల, తులసి పూసలు ధరిస్తారు. తులసి మాల అనేది పవిత్రమైన తులసి మొక్క కాండం నుంచి తయారు చేయబడిన హారం. ఈ మాల మెడలో మూడు తంతువులుగా ధరిస్తారు. శ్రీకృష్ణుడు మీద ఉన్న భక్తిని ఇది సూచిస్తుంది.

కృష్ణ భక్తులు తులసి మాల ఎందుకు ధరిస్తారు?

శ్రీకృష్ణుడు భక్తులు తరచుగా తులసి మాలని ధరిస్తారు. విష్ణువుకి ప్రియమైనదిగా కూడ భావిస్తారు. పూసలు ప్రతికూల శక్తులు, పీడకలలు, ప్రమాదాలు, ఆయుధ దాడుల నుంచి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు. ఇవి ధరించడం వల్ల భగవంతునికి ప్రియమైన వారిగా పరిగణించబడతారు. ఆధ్యాత్మిక మార్గం పట్ల వారికి ఉన్న భక్తి భావనని ఇది సూచిస్తుంది.

విష్ణువు, తులసి దేవితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. హిందూమతంలో రక్షకుడిగా విష్ణువుని భావిస్తారు. తులసి ఆకులతో విష్ణువుకు పూజ చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంటే దైవిక రక్షణ తెస్తుందని నమ్ముతారు. భగవంతుని ఆశీర్వాదం కోరుతూ తులసి మొక్కను ఇంట్లో నాటుతారు.

తులసి మాల ఎందుకంత ప్రత్యేకం

తులసి మాలని ధ్యానం చేసే వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఏకాగ్రత, సంపూర్ణత, ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు. తులసి పూసలు కదిలిస్తూ మంత్రాలు పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. తులసి మాల వేసుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా బలపడటం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. శ్రీకృష్ణుడుకి భక్తులు లొంగిపోవడాన్ని తులసి మాల సూచిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు

తులసి దాని ఔషధ గుణాలకి ఎంతో ప్రసిద్ధి చెందింది. శరీరాన్ని ఒత్తిడికు గురికాకుండా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించే అడాప్టోజెన్ విడుదల చేస్తుంది. ఈ మాల ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సహజమైన డిటాక్సిఫైయర్ గా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

పురాతన భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మెడ చుట్టూ తులసి మాల ఉండటం వల్ల శరీరంలోని శక్తి కేంద్రాలని సమతుల్యం చేయడంతో సహాయపడుతుంది. వీటిని చక్రాలు అని పిలుస్తారు. ఈ చక్రాలు సమతుల్యం కావడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

తులసిలో అడాప్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడిని, భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. తులసి మాల ధరించడం వల్ల నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ఆందోళన తగ్గిస్తుంది. అంతర్గత శాంతిని పెంపొందిస్తుంది.

తులసి మాల ఎలా ఉపయోగించాలి

తులసి మాలని ఉపయోగించే ముందు తులసి తైలం లేదా గంగాజలం కలిపిన నీటిలో ముంచి శుద్ధి చేయడం ఆచారం. మంత్రాలు జపిస్తూ తులసి మాలని గౌరవంగా ఉపయోగిస్తారు. తులసి మాల ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు, చేతబడిని దూరం చేస్తుందని నమ్ముతారు. దీన్ని ధరించడం వల్ల జీవితంలో అదృష్టం, శ్రేయస్సు, దీవెనలు లభిస్తాయి.

ధ్యానం చేసేటప్పుడు తులసి మాల ఉపయోగిస్తే మంత్రాలు పఠించడం వల్ల దృష్టి, ఏకాగ్రత పెరుగుతుంది. తులసి సువాసన, దైవిక శక్తితో అనుబంధం కలిగి ఉంటుంది. ధ్యానం చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Whats_app_banner