Andhra Pradesh News Live November 23, 2024: Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ-today andhra pradesh news latest updates november 23 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live November 23, 2024: Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ

Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ

Andhra Pradesh News Live November 23, 2024: Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ

04:38 PM ISTNov 23, 2024 10:08 PM HT Telugu Desk
  • Share on Facebook
04:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 23 Nov 202404:38 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tiruchanoor Padmavathi Brahmotsavam : నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు-టీటీడీ

  • Tiruchanoor Padmavathi Brahmotsavam : తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించున్నారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు మెరుగ్గా భ‌ద్రతా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఈవో పోలీసులకు సూచించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202403:43 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Kalyan : మహారాష్ట్రలో కలిసొచ్చిన పవన్ ప్రచారం, ఆ 11 స్థానాల్లో మహాయుతి విజయం

  • Pawan Kalyan : మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దూరదృష్టికి మహారాష్ట్ర ప్రజలు మరోసారి పట్టంకట్టారని స్పష్టం చేశారు. పవన్ ప్రచారం చేసిన 11 స్థానాల్లో మహాయుతి విజయం సాధించిందని జనసేన ప్రకటించింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202402:41 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు-రైతులకు అలర్ట్

  • AP Rains : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Prakasam Crime : ప్రేమ పేరుతో మైన‌ర్‌ను మోసం చేసిన యువ‌కుడు-పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు

  • Prakasam Crime : ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను మోసం చేశాడో యువకుడు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, యువకుడ్ని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202412:55 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు- నలుగురు మృతి, 8 మందికి గాయాలు

  • Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202410:31 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Fee Reimbursement : గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫీజు రియంబర్స్మెంట్ అప్లికేషన్లు స్వీకరణ, దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • AP Fee Reimbursement Apply : ఏపీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామాల వారీగా అర్హులైన విద్యార్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202409:50 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: NTR Bharosa Pension : ఏపీ పింఛన్ దారులకు అప్డేట్, పెన్షన్ దారుడు మ‌ర‌ణిస్తే భార్యకు పెన్షన్‌

  • NTR Bharosa Pension : పెన్షన్ల జారీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ దారుడు మరణిస్తే అతడి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202407:47 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Crime : అనంతపురంలో విషాదం - 5 నెలల చిన్నారిని చంపేసి త‌ల్లిదండ్రులు సూసైడ్..!

  • అనంత‌పురం జిల్లాలో విషాదం జరిగింది. చిన్నారితో స‌హా త‌ల్లిదండ్రులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడ్డారు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్ననార్ప‌ల పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202407:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore : నెల్లూరు జిల్లాకు చెందిన విద్యార్థి జ‌ర్మ‌నీలో మృతి.. తల్లిదండ్రులకు అనుమానాలు

  • Nellore : నెల్లూరు జిల్లాల‌కు చెందిన యువ‌కుడు జ‌ర్మ‌నీలో గుండెపోటుతో మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు అర్థంత‌రంగా చనిపోవడంతో.. త‌ల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఉన్న‌త చ‌దువుల కోసం జ‌ర్మనీ వెళ్లిన యువ‌కుడు ఇటీవ‌లి కార్ల కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అంతా బాగుంద‌నుకునే స‌మ‌యంలో చనిపోయాడు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202406:51 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు మరో అప్డేట్ - ఎల్లుండి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

  • Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి- 2025 కోటా టికెట్లు అందుబాటులోకి  వస్తున్నాయి. నవంబర్ 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202405:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Trains : ప్రయాణికులకు అలర్ట్.. ఈనెల 25న విజయవాడ డివిజన్‌లో ఈ రైళ్లు రద్దు

  • Vijayawada Trains : ఈనెల 25న విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అటు వాల్తేరు డివిజన్ నుంచి కొల్లాంకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202404:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sabarimala Special Trains : అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌ - శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లు, మరికొన్ని పొడిగింపు

  • అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీకాకుళం-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు  విశాఖపట్నం-కొల్లాం మధ్య నడుస్తున్న స్పెష‌ల్ రైళ్లను పొడిగించారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202402:11 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Recruitment 2024 : టీటీడీలో ఉద్యోగాలు... నవంబర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూలు

  • TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూలను నవంబర్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paramedical Admissions : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ - ముఖ్య తేదీలివే

  • AP Paramedical Courses : పారామెడికల్, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్లను స్వీకరిస్తారు.
పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Weather ALERT : బంగాళాఖాతంలో అల్పపీడనం...! 25,26 తేదీల్లో ఏపీకి భారీ వర్ష సూచన

  • AP Telangana Weather Updates: ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి