Female Zodiac Signs: ఈ ఏడాది కొన్ని రాశుల స్త్రీలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు-untitled story ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Female Zodiac Signs: ఈ ఏడాది కొన్ని రాశుల స్త్రీలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు

Female Zodiac Signs: ఈ ఏడాది కొన్ని రాశుల స్త్రీలు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు

Ramya Sri Marka HT Telugu
Nov 24, 2024 07:57 AM IST

Dangerous Female Zodiac Signs: పుట్టిన సమయాన్ని వారి రాశి చక్ర గుర్తులను బట్టి వారి ప్రవర్తన, భావోద్వేగాల ప్రదర్శన గురించి అంచనా వేయచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏడు రాశి చక్ర గుర్తులు కలిగిన స్త్రీలు ఈ ఏడాది తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రమాదకర రాశులు
ప్రమాదకర రాశులు

హిందూ ఆచార వ్యవహారాల్లో జ్యోతిష్య శాస్త్రానికి ప్రాముఖ్యత ఎక్కువ. దీని ప్రకారం పుట్టిన సమయాన్నిబట్టి ప్రతి ఒకరికీ ఒక రాశి చక్ర గుర్తు అంకితం చేయబడుతుంది. రాశి చక్ర గుర్తుల ద్వారా వ్యక్తి గతాన్ని, భవిష్యత్తును అంచనా వేయగలిగే శక్తి జ్యోతిష్య శాస్త్రానికి ఉంది. అలాగే వ్యక్తి స్వభావాన్ని, భావోద్వేగాల ప్రదర్శనను కూడా జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేయచ్చు.మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే ఏ సమస్యకైనా జ్యోతిష్య శాస్త్రం పరిష్కారం చూపించగలదు. అయితే పరిస్థితులను మార్చగలిగే శక్తి దీనికి లేనప్పటికీ కొన్ని పరిహారాలను సూచించి ప్రమాదాలను తగ్గించగలదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది కొన్ని రాశి చక్ర గుర్తులు కలిగిన స్త్రీలు ప్రమాదకారంగా మారతారట. తరచూ కోపం రావడం, గౌరవ మర్యాదల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించడం, వారి ఇష్టాలకు వ్యతిరేకంగా ఏం జరిగినా తట్టుకోకపోవడం వంటివి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయట.వాళ్ల జోలికి వీలైనంత వరకూ పోకుండా ఉండటమే మేలని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది. ఇంతకీ ఏయే రాశి స్త్రీలు ఈ ఏడాది ఒత్తిడి ఎదుర్కొనున్నారో తెలుసుకుందాం.

1. కర్కాటక రాశి:

ఈ రాశి వారు ఈ ఏడాది ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. కోపం, చిరాకు, అతిప్రేమ వంటి వాటిని ప్రదర్శిస్తుంటారు. తనతో పాటు తనకు ప్రియమైన వారి విషయంలో కూడా అతి జాగ్రత్త చూపిస్తుంటారు.కనుక ఈ రాశి స్త్రీలు ఏదైనా మాట్లాడే ముందు లేదా భావోద్వేగాలను ప్రదర్శించే ముందు కొన్ని క్షణాలు ఆగడం అలవాటు చేసుకుంటే మంచిది. ప్రశాంతత పంపొందించుకోవడం కోసం యోగా ధ్యానం వంటి వాటిని ఎంచుకోవాలి.

2. కన్యా రాశి:

ఈ రాశి స్త్రీలు అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటారు. ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. అందుకే ప్రతిసారి నిరాశకు గురవుతారు. చిన్న చిన్న విషయాల్లో అయినా ఓటమిని అంగీకరించలేరు. ఈ స్వభావాన్ని మార్చుకోవాలి.శ్వాస సంబంధిత వ్యాయామాల ద్వారా దీన్ని అధిగమించవచ్చు.

3. సింహ రాశి:

సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉండే సింహరాశి వారు తమని పట్టించుకోకపోతే మొండితనంగా, చిరాకుగా వ్యవహరిస్తూ ఉంటారు. ముందు చెప్పేది ప్రశాంతంగా విని స్పందించడం అలవాటు చేసుకుంటే ఈ వైఖరి నుంచి బయటపడొచ్చు. క్రియేటివ్‌గా ఉండే పనులను హాబీగా చేసుకోవడం వల్ల ప్రశాంతత దొరుకుతుంది.

4. మేష రాశి:

ధైర్యంగా ఉంటూ సహజ కార్యకర్తగా వ్యవహరించే ఈ రాశివారు కోపం రాగానే హఠాత్తుగా స్వభావం మార్చేసుకుంటారు. ఇది అనవసరమైన సంఘర్షణకు దారి తీయొచ్చు. దీని నుంచి బయటపడేందుకు పని చేసే ముందు లేదా నిర్ణయించుకునే ముందు పది అంకెలు లెక్కించడం ఉత్తమం. వీరు రెగ్యూలర్‌గా చేసే శారీరక కార్యకలాపాలైన యోగా లేదా రన్నింగ్ వంటి ప్రక్రియలు ప్రవర్తనను అదుపులో ఉంచుతాయి.

5. వృషభ రాశి:

వృషభ రాశి వారు దృఢ చిత్తులై ఉంటారు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే కోపంగా లేదా మొండిగా మారిపోతారు. కాంప్రమైజ్ అవడం లేదా కొత్త విషయాలను నేర్చుకోవడం వంటి వాటివల్ల బయటపడొచ్చు. గ్రౌండ్‌లో గడపడం వంటి పనులు భావోద్వేగాలను శాంతపరచడానికి సహాయపడుతుంది.

6. ధనుస్సు రాశి:

స్వేచ్ఛకు విలువనిచ్చే రాశి ధనుస్సు రాశి. పరిధులు విధించిన పరిస్థితుల్లో ఇమిడాల్సి వస్తే సులభంగా అసహనానికి గురవుతారు. శక్తి మేర ప్రయత్నించడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు.

7. వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఎక్కువ ఇష్టంతో వ్యవహరిస్తుంటారు. ఇతరులు వీరిని ద్రోహం లేదా తప్పుగా అర్థం చేసుకున్నట్లుగా భావిస్తే వారిని దూరం ఉంచుతారు. క్షమించడం, పగను మరిచిపోవడం వంటివి మళ్లీ శాంతియుతంగా ఉండటానికి సహాయపడుతుంది.

Whats_app_banner