Cheese Onion rings: పిల్లల కోసం చీజ్ ఆనియన్ రింగ్స్ ఇంట్లోనే ఇలా చేసేయండి-cheese onion rings recipe in telugu know how to make this snacks ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cheese Onion Rings: పిల్లల కోసం చీజ్ ఆనియన్ రింగ్స్ ఇంట్లోనే ఇలా చేసేయండి

Cheese Onion rings: పిల్లల కోసం చీజ్ ఆనియన్ రింగ్స్ ఇంట్లోనే ఇలా చేసేయండి

Haritha Chappa HT Telugu
Nov 22, 2024 03:30 PM IST

Cheese Onion rings: బయట ఉల్లిపాయలతో చేసిన ఆనియన్ రింగ్స్ కొని తెస్తూ ఉంటారు. నిజానికి వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చు. చీజ్ ఆనియన్ రింగ్స్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము వీటిని ఫాలో అవ్వండి.

చీజ్ ఆనియన్ రింగ్స్ రెసిపీ
చీజ్ ఆనియన్ రింగ్స్ రెసిపీ

చీజ్ ఆనియన్ రింగ్స్ అనగానే చాలామందికి నోరూరిపోతుంది. ఇవి క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. బయట ఆనియన్స్ రింగ్స్ దొరుకుతూ ఉంటాయి. వీటిని ఎక్కువగా కొని తింటూ ఉంటారు. నిజానికి ఇంట్లోనే ఆనియన్ రింగ్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికి చీజ్ కూడా జోడించి చీజ్ ఆనియన్ రింగ్స్ చేస్తే రుచి అదిరిపోతుంది. ఇక్కడ మేము చీజ్ ఆనియన్స్ రింగ్స్ చాలా సులువుగా ఎలా చేయాలో చెప్పాము. ఈ పద్ధతి ఫాలో అయిపోతే అరగంటలో మీరు టేస్టీ స్నాక్స్ వండేసుకోవచ్చు.

చీజ్ ఆనియన్ రింగ్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

ఆనియన్ రింగ్స్ - రెండు కప్పులు

చీజ్ స్లైసులు - పది

బ్రెడ్ పొడి - అరకప్పు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

మైదా - అరకప్పు

కార్న్ ఫ్లోర్ - పావు కప్పు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

వెల్లుల్లి పొడి - ఒక స్పూను

చిల్లి ఫ్లెక్స్ - ఒక స్పూను

ఒరెగానో - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

చీజ్ ఆనియన్ రింగ్స్ రెసిపీ

1. ఆనియన్ రింగ్స్ చేయడానికి ఉల్లిపాయలను అడ్డంగా కోసి రింగ్స్ లాగా విడదీసుకోవాలి.

2. ఇప్పుడు చీజ్ స్లైసులను తీసుకుని నిలువుగా చిన్న రిబ్బన్లలా కోసుకోవాలి.

3. నిలువుగా కోసుకున్న వాటిని ఆనియన్ రింగ్స్ లోపల రౌండ్ గా వచ్చేలా పెట్టుకోవాలి.

4. కాస్త గట్టిగా నొక్కితే ఆ చీజ్ ఉల్లిపాయ రింగ్ కు రౌండ్ గా అతుక్కుపోతుంది.

5. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర తరుగు, అల్లం పొడి, చిల్లీ ఫ్లెక్స్, ఒరెగానో, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

6. కొంచెం నీరు పోసి అది దోశ పిండి లాగా పలచగా అయ్యేవరకు కలుపుకొని పక్కన పెట్టాలి.

7. ఇప్పుడు బ్రెడ్ పొడిని ఒక ప్లేట్లో వేసుకోవాలి.

8. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

9. ఇప్పుడు చీజ్ ఆనియన్ రింగ్ మైదాపిండి మిశ్రమంలో ముంచాలి.

10. దాన్ని తీసి బ్రెడ్ పొడి పై పెట్టి ఆ బ్రెడ్ పొడి దానికి అంటుకునేలా చేయాలి.

11. తర్వాత వేడెక్కిన నూనెలో వీటిని వేసి వేయించుకోవాలి.

12. రంగు మారేవరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.

13. అన్నింటినీ ఇలా వేయిస్తే ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ చట్నీతో లేదా కెచప్ తో ఇవి తింటే రుచి అదిరిపోతుంది.

పిల్లలకు ఈ చీజ్ ఆనియన్ రింగ్స్ కచ్చితంగా నచ్చుతాయి. ఒక్కసారి తిన్నారంటే మిమ్మల్ని వారు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు. దీన్ని రెసిపీ కూడా చాలా సులువు. మీరు వారికి తరచూ దీన్ని చేసి ఇవ్వవచ్చు.

Whats_app_banner