Nayanthara Vignesh Shivan: డిన్నర్ చేయడానికి అరగంట క్యూలో నిల్చొన్న నయనతార, విఘ్నేష్ శివన్.. ఢిల్లీలో డిన్నర్ డేట్-nayanthara vignesh shivan wait for 30 minutes in que for dinner in a delhi restaurant ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Vignesh Shivan: డిన్నర్ చేయడానికి అరగంట క్యూలో నిల్చొన్న నయనతార, విఘ్నేష్ శివన్.. ఢిల్లీలో డిన్నర్ డేట్

Nayanthara Vignesh Shivan: డిన్నర్ చేయడానికి అరగంట క్యూలో నిల్చొన్న నయనతార, విఘ్నేష్ శివన్.. ఢిల్లీలో డిన్నర్ డేట్

Hari Prasad S HT Telugu

Nayanthara Vignesh Shivan: నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఢిల్లీలో డిన్నర్ డేట్ కు వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లిన రెస్టారెంట్ ఫుల్ గా ఉండటంతో అరగంటసేపు వేచి చూసి మరీ డిన్నర్ చేయడం విశేషం. ఈ వీడియో వైరల్ అవుతోంది.

డిన్నర్ చేయడానికి అరగంట క్యూలో నిల్చొన్న నయనతార, విఘ్నేష్ శివన్.. ఢిల్లీలో డిన్నర్ డేట్

Nayanthara Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మధ్యే తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి కాకే దా హోటల్ లో నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి నయన్, విఘ్నేష్ సుమారు అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చింది. నవంబర్ 18న నయన్ బర్త్ డే జరుపుకోవడానికి తాము ఢిల్లీ వెళ్లినట్లు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.

నయనతార డిన్నర్ డేట్

లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచినా నయనతార మాత్రం ఈ డిన్నర్ డేట్ కు భర్తతో కలిసి ఓ సాధారణ జంటలాగే వెళ్లింది. ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం ఈ జంట చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను రెస్టారెంట్ లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ డిన్నర్ డేట్, వీడియోపై విఘ్నేష్ శివన్ స్పందించాడు. "నవంబర్ 17న ఓ చిన్న బర్త్ డే ఈవెనింగ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లాం. ఆ క్షణాన్ని క్యాప్చర్ చేసిన ఓ అపరిచిత వ్యక్తికి థ్యాంక్స్" అని అతడు అన్నాడు. ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్న విఘ్నేష్.. టేబుల్ కోసం అరగంటపాటు లైన్లో వేచి ఉన్నట్లు చెప్పడం విశేషం.

ఈ వీడియోలో ఈ సెలబ్రిటీ కపుల్ ఒకరికొకరు తినిపించుకోవడం కనిపించింది. హిందీలో జవాన్ లాంటి సినిమాలో షారుక్ ఖాన్ తో కలిసి నటించి నార్త్ లోనూ నయన్ మంచి పేరు సంపాదించుకుంది. అలాంటి సెలబ్రిటీ ఓ సాధారణ వ్యక్తిలాగా ఎంతో బిజీగా ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అందరి మధ్యలో కూర్చొని తినడం అక్కడి వాళ్లను ఆకర్షించింది.

నయన్ డిన్నర్ డేట్‌పై ఫ్యాన్స్ రియాక్షన్

ఇదో బెస్ట్ బర్త్ డే డిన్నర్ అని ఓ వ్యక్తి ఈ వీడియోపై కామెంట్ చేశారు. పబ్లిక్ లోనూ ఎలాంటి అవాంతరాలు లేకుండా నయన్, ఆమె భర్త డిన్నర్ చేయడం చూస్తుంటే బాగా అనిపిస్తోందని మరొకరు అన్నారు. అక్కడున్న వాళ్లు జవాన్ మూవీ చూడలేదేమో అని ఇంకో అభిమాని సరదాగా కామెంట్ చేయడం విశేషం.

నయనతార, విఘ్నేష్ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యుమెంటరీ ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో ఓ పాత క్లిప్ వాడినందుకు నయన్ దంపతులకు ధనుష్ నోటీసులు పంపడంతో దుమారం కూడా రేగింది. ఎన్నో రోజులుగా ధనుష్, నయన్ మధ్య ఉన్న విభేదాలు దీనివల్ల మరింత ముదిరాయి.