Mechanic Rocky OTT: మెకానిక్ రాకీ ఓటీటీలో ఓ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుందంటే?
Vishwak Sen: విష్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఓ మంచి ఫ్యాన్సీ రేటుకి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయట. ఇక మెకానిక్ రాకీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
విష్వక్‌సేన్ హీరోగా నటించిన మెకానిక్ రాకీ మూవీ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విష్వక్ సేన్‌కి జంటగా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ నటించగా.. రామ్ తుళ్లూరి నిర్మించారు.
విష్వక్ సేన్ గంపెడాశలు
విష్వక్ సేన్ నటించిన చివరి రెండు సినిమాలు గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దాంతో.. ఈ మెకానిక్ రాకీపై ఈ యంగ్ హీరో గంపెడాశలు పెట్టుకున్నాడు. కానీ.. సినిమాపై మిక్స్‌డ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఈ సినిమాలోని లోపాల్ని ఎత్తిచూపుతూ సెటైర్లు వేస్తున్నారు.
ట్రైయాంగిల్ లైవ్ స్టోరీ కాదు.. కానీ?
వాస్తవానికి మెకానిక్ రాకీ ట్రైలర్, పోస్టర్లను చూస్తే.. ఇది ట్రైయాంగిల్ లైవ్ స్టోరీగా అనిపించింది. కానీ.. ఊహించని ట్విస్ట్‌లతో సెకండ్ హాఫ్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు రవితేజ ముళ్లపూడి మార్చేశారు. అయితే.. ఫస్ట్ హాఫ్‌లో సాగదీతతో బోర్‌గా ఫీల్ అయ్యామని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్‌గా మెకానిక్ రాకీ మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో ఉంది.
మెకానిక్ రాకీ ఓటీటీలోకి ఎప్పుడు రానుందంటే?
మెకానిక్ రాకీ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్ ఫ్యాన్సీ ధరకి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజైన 4-6 వారాలలోపు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి పెడుతున్నారు. ఈ లెక్కన డిసెంబరు చివర్లో లేదా జనవరి మొదటి వారంలో మెకానిక్ రాకీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే.. ఒకవేళ సినిమా ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోతే.. ఇంకా ముందుగానే ఓటీటీకి వచ్చే అవకాశాలూ లేకపోలేదు.
నెలలోనే మీనాక్షి చౌదరికి మూడో సినిమా
హీరోయిన్ మీనాక్షి చౌదరికి నెల వ్యవధిలోనే ఇది మూడో సినిమా. దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె నటించి లక్కీ భాస్కర్ మూవీ అక్టోబరు 31న దీపావళికి విడుదలై హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రెండు వారాల వ్యవధిలో వరుణ్‌తేజ్‌తో జంటగా నటించిన మాట్కా సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పుడు మెకానిక్ రాకీ భవిష్యత్తు గురించి తెలియాలంటే.. ఒక్కరోజు ఆగాల్సిందే.