Thangalaan OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న విక్రమ్ తంగలాన్ - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Thangalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. డిసెంబర్ నెలలోనే ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
Thangalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ కోసం ఓటీటీ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్నారు. కోర్టు కేసుతో పాటు నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే కోర్టు కేసుకు సంబంధించిన క్లియరెన్స్ వచ్చింది.ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ప్రొడక్షన్ హౌజ్‌కు ఏర్పడిన విభేదాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
డిసెంబర్‌లో స్ట్రీమింగ్...
అడ్డంకులన్నీ తొలగిపోవడంలో డిసెంబర్ నెలలోనే తంగలాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. డిసెంబర్ 13 లేదా 20 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటోన్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో తంగలాన్ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు.పీరియాడికల్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
పా రంజిత్ డైరెక్టర్...
విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా కనిపించారు.. ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
డీ గ్లామర్ పాత్రలో...
తంగలాన్‌గా విక్రమ్ లుక్, యాక్టింగ్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తంగలాన్ మూవీకిగాను విక్రమ్‌తో పాటు పార్వతికి నేషనల్ అవార్డు తప్పకుండా రావడం ఖాయమంటూ పేర్కొన్నారు. అయితే కాన్సెప్ట్‌లో ఆసక్తి లోపించడం, తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడంలో దర్శకుడి తడబాటు కారణంగా ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.
దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకున్నది. తంగలాన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి పా రంజిత్ తంగలాన్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.
తంగలాన్ పోరాటం...
స్వేచ్ఛ స్వాతం త్య్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పా రంజిత్ తంగలాన్ మూవీని తెరకెక్కించాడు. వేప్పూరుకు చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతి) ఐదుగురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు.
పన్ను కట్టలేదని సాకుగా చూపించి తంగలాన్ భూమిని ఊరి జమీందారు స్వాధీనం చేసుకుంటాడు. జమీందారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం బ్రిటీషర్లతో కలిసి అడవిలో ఓ బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు తంగలాన్.
ఆ నిధికి ఆరతి (మాళవికా మోహనన్) రక్షణగా నిలుస్తుంది. అసలు ఆరతి ఎవరు? బంగారం కోసం అడవిలో అడుగుపెట్టిన తంగలాన్‌తో పాటు అతడి బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బ్రిటీషర్ల వెంట వెళ్లిన తంగలాన్ వారిపై ఎందుకు తిరుగుబాటు చేశాడు అన్నదే ఈ మూవీ కథ.