OTT: అమెజాన్ ప్రైమ్ వీడియో చేతికి రెండు పవర్ స్టార్ సినిమాల ఓటీటీ హక్కులు.. అనుష్క - క్రిష్ సహా మొత్తంగా 7 చిత్రాలు
Amazon Prime Video - Telugu Movies: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ తాజాగా కొన్ని పాపులర్ తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత వీటిని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేలా డీల్ చేసుకుంది.
Prime Video - Telugu Movies: కొన్ని అప్‍కమింగ్ పాపులర్ తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మంగళవారం (మార్చి 19) ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‍లో ఇందుకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. 7 తెలుగు సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల గురించి ప్రైమ్ వీడియో ఈ ఈవెంట్‍లో ప్రకటించింది. థియేటర్లలో రిలీజ్, థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఆ సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానున్నాయి. ఇప్పుడు ప్రకటించిన ఆ ఏడు సినిమాలు ఏవంటే..
ఓం భీమ్ బుష్
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీమ్ బుష్ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కైవసం చేసుకుంది. ఈ కామెడీ మూవీ మార్చి 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రన్ తర్వాత ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుంది. ఈ ఓం భీమ్ బుష్ హర్ష కొనగంటి దర్శకత్వం వహించారు. వీ సెల్యూలాయిడ్ నిర్మించింది.
ఫ్యామిలీ స్టార్
ఫ్యామిలీ స్టార్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కూడా ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శత్వం వహిస్తున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి ఈ మూవీ వస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మంగళవారం (మార్చి 19) ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ కూడా వచ్చింది.
హరిహర వీరమల్లు
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా మూడేళ్లుగా సాగుతోంది. అయినా ఓ కొలిక్కి రాలేదు. ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుంది ప్రైమ్ వీడియో. ఈ ఈవెంట్‍కు క్రిష్ హాజరయ్యారు. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకోలేదనే క్లారిటీ వచ్చింది. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ డేట్‍ను త్వరలోనే మూవీ టీమ్ ప్రకటించే ఛాన్స్ ఉంది.
క్రిష్ - అనుష్క సినిమా టైటిల్ ఇదే
సీనియర్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఘాటి అనే టైటిల్ ఖరారైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది.
తమ్ముడు సినిమా
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రానికి తమ్ముడు టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను కూడా ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
గేమ్ ఛేంజర్
గ్లోబల్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ మూవీ తెరకెక్కుతోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కైవసం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్, రన్ తర్వాత ఈ సినిమా ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది.
టాపిక్