తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli: విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు.. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్‌గా..
- RCB vs CSK IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మరో మైలురాయి దాటాడు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- RCB vs CSK IPL 2024: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మరో మైలురాయి దాటాడు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్‌తో నేటి (మే 18) మ్యాచ్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 47 పరుగులతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో విరాట్ ఓ అరుదైన రికార్డు సాధించాడు.(ANI)
(2 / 5)
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మార్క్ దాటాడు. దీంతో ఐపీఎల్‍లో ఒకే వేదికలో 3000 పరుగుల మైలురాయి సాధించిన తొలి ప్లేయర్‌గా విరాట్ చరిత్ర సృష్టించాడు. (PTI)
(3 / 5)
విరాట్ కోహ్లీ మొత్తంగా ఐపీఎల్‍లో ఇప్పటి వరకు 251 మ్యాచ్‍ల్లో 7,971 పరుగులు చేశాడు. ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు జాబితాలోనూ టాప్‍లోనేే ఉన్నాడు. (AP)
(4 / 5)
ఐపీఎల్‍లో 700 ఫోర్ల మార్క్ దాటిన రెండో ప్లేయర్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (768) తొలి ప్లేస్‍లో ఉన్నాడు. ఐపీఎల్‍లో అత్యధిక ఫోర్లు జాబితాలో శిఖర్, కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (599), సురేశ్ రైనా (506) ఉన్నారు. (AP)
ఇతర గ్యాలరీలు