Devi Sri Prasad: పుష్ప 2 నిర్మాతలపై దేవిశ్రీ ప్రసాద్ సెటైర్లు- గతంలో డైరెక్టర్ బోయపాటిశ్రీనుపై ఇలాగే!
Devi Sri Prasad: పుష్ప 2 చెన్నై ఈవెంట్‌లో నిర్మాతలపై దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. టైమ్‌కు పాట ఇవ్వలేదు...టైమ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు...టైమ్‌కు పోగ్రామ్‌కు రాలేదంటూ నిర్మాతలకు నాపై కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయని దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
Devi Sri Prasad: చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో నిర్మాతలకు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే నిర్మాతలను ఉద్దేశించి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సెటైర్లు వేయడం ఆసక్తికరంగా మారింది. నేను ఓపెన్ అంటూ నిర్మాతలకు, తనకు మధ్య ఉన్న గొడవలు మొత్తం బయటపెట్టేశారు దేవిశ్రీప్రసాద్.
నిర్మాత రవిగారికి నాపై ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. “నేను టైమ్‌కు పాట ఇవ్వలేదు...టైమ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు...టైమ్‌కు పోగ్రామ్‌కు రాలేదని అనొద్దు” అని దేవిశ్రీప్రసాద్ చెప్పాడు. నేను స్టేజ్ ఎక్కి ఎక్కువ సేపు మాట్లాడాలని అనుకోవద్దని నిర్మాతలతో దేవిశ్రీప్రసాద్ తెలిపాడు.
కరెక్ట్ టైమ్‌కు వచ్చా...
చెన్నై ఈవెంట్‌కు తాను సరైన టైమ్‌లో రాలేదని నిర్మాతలు చెప్పిన మాటలపై దేవిశ్రీప్రసాద్ ఫైర్ అయ్యాడు. తాను కరెక్ట్ టైమ్‌కు ఈవెంట్‌కు వచ్చానని, కెమెరా ఎంట్రీ అని చెప్పి తనను ఆపేశారని దేవిశ్రీప్రసాద్ తెలిపాడు. కిస్సిక్ సాంగ్ వస్తుందని పరిగెత్తుకుంటూ స్టేజ్ దగ్గరకు వచ్చానని దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
రాంగ్ టైమింగ్ సార్.... లేట్ అంటూ నిర్మాత రవి తనతో అన్నారని దేవిశ్రీప్రసాద్ చెప్పాడు. లోపలికి వస్తానంటే తనను రానివ్వకపోతే నేనేం చేయగలను అని దేవిశ్రీప్రసాద్ అన్నాడు. ఇవన్నీ సఫరేట్‌గా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా అడిగితేనే కిక్...నేను ఎప్పుడూ ఇంతే ఓపెన్‌గా ఉంటా. ఎప్పుడూ ఆన్ టైమ్‌కే వస్తా అని దేవిశ్రీప్రసాద్ తెలిపాడు.
ఏం కావాలన్న అడిగి తీసుకోవాలి...
“మనకు ఏం కావాలన్న అడిగి తీసుకోవాలి...నిర్మాత దగ్గర పేమెంట్ అయినా...స్క్రీన్ మీద క్రెడిట్ అయినా సరే అంటూ ”దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
బీజీఎమ్...
పుష్ప సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందించాడు. కానీ పుష్ప 2 మూవీకి దేవిశ్రీప్రసాద్ కేవలం పాటలను మాత్రమే సమకూర్చుతున్నాడు. బీజీఎమ్ తమన్‌తో పాటు సామ్ సీఎస్, అజనీష్ లోకనాథ్ అందిస్తోన్నారు. దేవిశ్రీప్రసాద్ బీజీఎమ్ విషయంలో సుకుమార్‌తో పాటు ప్రొడ్యూసర్లు అసంతృప్తిగా ఫీలైనట్లు ప్రచారం జరుగుతోంది.
అందుకే దేవిశ్రీ స్థానంలో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నట్లు చెబుతోన్నారు. మ్యూజిక్ విషయంలో క్రెడిట్ ఇవ్వకపోవడంతో పాటు తనపై నిర్మాతలు చేసిన కంప్లైంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని దేవిశ్రీప్రసాద్ ఈ కామెంట్స్ చేసినట్లు చెబుతోన్నారు.
బోయపాటి శ్రీనుకు కూడా...
గతంలో లెజెండ్ సినిమా ఈవెంట్‌లో ఇలాగే బోయపాటి శ్రీనుకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు దేవిశ్రీప్రసాద్. టాలీవుడ్ డైరెక్టర్‌పై దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. లెజెండ్ సినిమా విషయంలో పట్టుబట్టి తానే దేవిశ్రీతో మ్యూజిక్ చేయించుకున్నానంటూ అతడిని తక్కువ చేసి మాట్లాడాడు బోయపాటి శ్రీను. అదే ఈవెంట్‌లో బోయపాటికి దేవిశ్రీప్రసాద్ కౌంటర్ ఇచ్చాడు.
ఇంగ్లీష్ సినిమాలు చూడటం తప్ప తనకు బోయపాటి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదంటూ పేర్కొనడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఈ గొడవ జరిగిన తర్వాత బోయపాటి శ్రీను సినిమాలకు దేవిశ్రీప్రసాద్ దూరమయ్యాడు.