Telugu Cinema News Live November 25, 2024: Kannappa: కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి రానున్న మంచు విష్ణు పాన్ ఇండియన్ మూవీ!
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Mon, 25 Nov 202404:54 PM IST
Tollywood:మంచు విష్ణు కన్నప్ప మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. 25 ఏప్రిల్ 2025 విడుదలకాబోతున్నట్లు మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
Mon, 25 Nov 202403:11 PM IST
Bigg Boss Yashmi: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ ఎవరనే దానిపై యష్మి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పింది. నిఖిల్, పృథ్వీతో పాటు గౌతమ్ పేరు కాకుండా లేడీ కంటెస్టెంట్ బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తుందని అన్నది. బిగ్‌బాస్ బజ్‌లో నిఖిల్‌తో లవ్ ట్రాక్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Mon, 25 Nov 202401:12 PM IST
Web Series: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్ సిరీస్ వికటకవి నవంబర్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ కథతో తొలుత సినిమా చేయాలని అనుకున్నామని, జీ5 ఓటీటీ వల్ల వెబ్‌సిరీస్‌గా మారిందని ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి అన్నారు.
Mon, 25 Nov 202410:49 AM IST
Devi Sri Prasad: పుష్ప 2 చెన్నై ఈవెంట్‌లో నిర్మాతలపై దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. తాను టైమ్‌కు పాట ఇవ్వలేదు...టైమ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు...టైమ్‌కు పోగ్రామ్‌కు రాలేదంటూ నిర్మాతలకు నాపై కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్నాయని దేవిశ్రీప్రసాద్ అన్నాడు.
Mon, 25 Nov 202410:37 AM IST
- Vere Level Office OTT Streaming Trailer: ఓటీటీలోకి సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్, శుభ శ్రీ రాయగురు, ఆర్జే కాజల్, జబర్దస్త్ రీతూ చౌదరి నటిస్తున్నారు. తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Mon, 25 Nov 202409:41 AM IST
Fahadh Faasil: హీరో ఫహాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ మలయాళం, తమిళ భాషల్లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నాడు. 1980, 90 దశకంలో పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఫాజిల్ తెలుగులోనూ నాగార్జునతో కిల్లర్ మూవీ చేశాడు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
Mon, 25 Nov 202408:57 AM IST
Crime Thriller OTT: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
Mon, 25 Nov 202408:49 AM IST
- Bigg Boss Telugu 8 13th Week Nominations Highlights: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు నవంబర్ 25 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో నబీల్‌కు గౌతమ్, పృథ్వీకి అవినాష్ నోట మాటరాకుండా ఇచ్చి పడేశారు.
Mon, 25 Nov 202407:44 AM IST
OTT Release Movies This Week: ఓటీటీల్లోకి ఈ వారం 24 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో కేవలం 4 మాత్రమే చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అందులో క్రైమ్ థ్రిల్లర్, మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ రెండు వెబ్ సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో చూసేద్దాం.
Mon, 25 Nov 202406:31 AM IST
- Nindu Noorella Saavasam November 25th Episode: నిండు నూరేళ్ల సావాసం నవంబర్ 25 ఎపిసోడ్‌లో భాగీకి కరుణ్ కాల్ చేస్తే అమర్ లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. భర్తతో సాంబ్రాణి వేయించుకోవడం అంటే భాగీ ఇష్టమని, అవసరం ఉన్న అడగడదని గొప్పగా చెబుతుంది కరుణ. దాంతో భాగీకి అమర్ సాంబ్రాణి వేస్తాడు. అందుకోసం తంటాలు పడతాడు.
Mon, 25 Nov 202405:34 AM IST
- Samantha About Expensive Gifts To Naga Chaitanya: నాగ చైతన్యపై చాలా ఖర్చు చేసినట్లు తాజాగా సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, శోభిత ధూళిపాళతో నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.
Mon, 25 Nov 202404:46 AM IST
- Samuthirakani Mr Manikyam Release Date: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ డైరెక్టర్ సముద్రఖని అలరించడానికి సిద్ధంగా ఉన్న మరో సినిమా మిస్టర్ మాణిక్యం. తాజాగా మిస్టర్ మాణిక్యం మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ విడుదల చేశారు.
Mon, 25 Nov 202403:03 AM IST
Gunde Ninda Gudi Gantalu Serial November 25 Episode: గుండె నిండా గుడి గంటలు నవంబర్ 25 ఎపిసోడ్‌లో ఇంటి బయట టపాసులు కాలుస్తున్న శ్రుతిపైకి కారుతో గుద్ది చంపాలని ప్రయత్నిస్తాడు సంజు. కానీ, రవి వచ్చి అడ్డుకుంటాడు. దాంతో శ్రుతి కాలికి గాయం అవుతుంది. మరోవైపు మీనాకు సపోర్ట్‌గా ప్రభావతితో మాట్లాడుతాడు బాలు.
Mon, 25 Nov 202401:55 AM IST
- Brahmamudi Serial November 25th Episode: బ్రహ్మముడి నవంబర్ 25 ఎపిసోడ్‌లో అపర్ణ చెప్పగానే రాజ్‌ను ఇంట్లో అంతా తిడతారు. కావ్య ఇంటికి వెళ్లికి తీసుకురమ్మని చెబుతారు. దాంతో కనకం ఇంటికి వెళ్లిన కావ్యతో గొడవ పడతాడు రాజ్. దానికి రాజ్‌పై అదిరిపోయే పంచ్‌లు వేస్తుంది కావ్య. అలాగే కనకంకు అపర్ణ బానిసలా ఉంటుంది.
Mon, 25 Nov 202412:41 AM IST
- Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఇవాళ ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. రంగు పడుద్ది కాన్సెప్ట్‌తో ఈ వారం నామినేషన్స్ నిర్వహించారు.