Bigg Boss Nominations: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రంగుపడుద్ది కాన్సెప్ట్- ఆ ఇద్దరు తప్పా ఏడుగురు నామినేట్- ఎవరంటే?-bigg boss telugu 8 thirteenth week nominations contestants are 7 gautham nikhil bigg boss 8 telugu nominations 13th week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Nominations: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రంగుపడుద్ది కాన్సెప్ట్- ఆ ఇద్దరు తప్పా ఏడుగురు నామినేట్- ఎవరంటే?

Bigg Boss Nominations: ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రంగుపడుద్ది కాన్సెప్ట్- ఆ ఇద్దరు తప్పా ఏడుగురు నామినేట్- ఎవరంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2024 06:11 AM IST

Bigg Boss Telugu 8 Thirteenth Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ కూడా రచ్చ రచ్చ అన్నట్లుగానే సాగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ఇవాళ ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్‌ను ప్రసారం చేయనున్నారు. రంగు పడుద్ది కాన్సెప్ట్‌తో ఈ వారం నామినేషన్స్ నిర్వహించారు.

ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రంగుపడుద్ది కాన్సెప్ట్- ఆ ఇద్దరు తప్పా ఏడుగురు నామినేట్- ఎవరంటే?
ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో రంగుపడుద్ది కాన్సెప్ట్- ఆ ఇద్దరు తప్పా ఏడుగురు నామినేట్- ఎవరంటే? (Disney Plus Hotstar/YouTube)

Bigg Boss 8 Telugu 13th Week Nominations: బిగ్ బాస్ తెలుగు 8 పన్నెండో వారం యష్మీ గౌడ ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి వెళ్లిపోయింది. దాంతో పదిమంది వరకు ఉన్న ఇంటి సభ్యులు ఇప్పుడు 9 మందే మిగిలారు. ప్రస్తుతం హౌజ్‌లో యష్మీ ఎలిమినేషన్‌తో నబీల్, అవినాష్, గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, రోహిణి, విష్ణుప్రియ, టేస్టీ తేజ తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు.

ఈ వారం నామినేషన్స్

ఈ తొమ్మిది మందికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించారు. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిపోయింది. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ ఎపిసోడ్‌ను ఇవాళ (నవంబర్ 25) ప్రసారం చేయనున్నారు. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను పెట్టారు.

రంగు పడుద్ది కాన్సెప్ట్

బిగ్ బాస్ తెలుగు 8 13వ వారం నామినేషన్స్ ప్రక్రియను రంగు పడుద్ది కాన్సెప్ట్‌తో నిర్వహించారు. బిగ్ బాస్ ఫినాలేలో ఎవరు ఉండకూడదని అనుకుంటున్నారో వారికి సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఎవరిని నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారిపై రంగు పోసి నామినేట్ చేయడం ఈ రంగు పడుద్ది కాన్సెప్ట్.

గొడవలతో రచ్చ

ఈ బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో కూడా గొడవలు బాగానే జరిగినట్లు సమాచారం. గౌతమ్‌ను నబీల్ నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లోనే గౌతమ్ ఫైర్ చూపిస్తాడని, ఆటలో కూడా చూపించమని నబీల్ నామినేట్ చేశాడు. దానికి సరైన ఆన్సర్ గౌతమ్ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ వారం నామినేషన్స్‌లో రోహిణి వర్సెస్ విష్ణుప్రియ మధ్య కూడా గొడవ బాగానే జరిగిందట.

ఆ ఇద్దరు తప్పా

పృథ్వీ లవ్ ట్రాక్‌పై రోహిణి, విష్ణుప్రియ వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, పృథ్వీ, అవినాష్ మధ్య కూడా జోరుగా గొడవ జరిగినట్లు సమాచారం. ఇద్దరు నామినేషన్స్‌లో బాగానే వాదించికున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్‌లో ఇద్దరు తప్పా మిగిలిన ఏడుగురు నామినేట్ అయినట్లు సమాచారం.

ప్రతివారం సేవ్ అవుతూనే

మెగా చీఫ్ అయిన కారణంగా జబర్దస్త్ రోహిణిని ఎవరు నామినేట్ చేయడానికి వీళ్లేదు. దాంతో రోహిణి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయింది. రోహిణి ప్రతివారం ఏదో ఒకలా నామినేషన్స్ నుంచి సేవ్ అవుతూనే వస్తోంది. ఇక నబీల్‌ కూడా ఈ వారం నామినేట్ కాలేదు. అయితే, నబీల్‌ను ఎవరు నామినేట్ చేయకుండా ఉండాలి. అందుకే నబీల్ ఈ వారం నామినేషన్స్‌లో లేడు.

ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు

ఇక గౌతమ్ కృష్ణపై బిగ్ బాంబ్ పేల్చి యష్మీ డైరెక్ట్ నామినేట్ చేసింది. దాంతో గౌతమ్ డైరెక్ట్‌గా ఈ వారం నామినేషన్స్‌లోకి వచ్చాడు. బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్‌లో గౌతమ్‌తోపాటు నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, టేస్టీ తేజ, అవినాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా బిగ్ బాస్ తెలుగు 8 ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు నామినేట్ అయినట్లు సమాచారం.

Whats_app_banner