Samantha: నాగ చైతన్యపై వృథాాగా ఖర్చు పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్-samantha on expensive gifts to naga chaitanya over wedding with sobhita dhulipala in citadel honey bunny ott promotions ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: నాగ చైతన్యపై వృథాాగా ఖర్చు పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Samantha: నాగ చైతన్యపై వృథాాగా ఖర్చు పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Sanjiv Kumar HT Telugu
Nov 25, 2024 03:03 PM IST

Samantha About Expensive Gifts To Naga Chaitanya: నాగ చైతన్యపై చాలా ఖర్చు చేసినట్లు తాజాగా సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, శోభిత ధూళిపాళతో నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో సమంత కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

నాగ చైతన్యపై వృథాాగా ఖర్చు పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
నాగ చైతన్యపై వృథాాగా ఖర్చు పెట్టా.. సమంత షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Samantha On Naga Chaitanya Expensive Gifts: ఎప్పుడో ఓ చోట, ఏదో ఒక సందర్భంలో నాగ చైతన్య, సమంత టాపిక్ వస్తూనే ఉంది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ, నాగ చైతన్యతో ప్రేమాయణం, ఆ తర్వాత పెళ్లి, అనంతరం విడాకులు ఇలా సమంత జీవితంలో అన్ని జరిగిపోయాయి.

డిసెంబర్ 4న చైతూ శోభిత పెళ్లి

విడాకుల అనంతరం నాగ చైతన్య, సమంత ఎవరి జీవితం వారు గడిపేస్తున్నారు. ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అంతేకాకుండా నాగ చైతన్య త్వరలో రెండో పెళ్లి కూడా చేసుకోనున్నాడు. బోల్డ్ బ్యూటి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య ఎంగేజ్‌మెంట్ ఆగస్ట్ 8న జరిగింది. ఇటీవలే శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలైపోయాయి. ఇక డిసెంబర్ 4న నాగ చైతన్య శోభిత ధూళిపాళ వివాహం జరగనుంది.

సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ స్ట్రీమింగ్

ఈ నేపథ్యంలో తాజాగా సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న సమంత నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 6 నుంచి సిటాడెల్ హనీ బన్నీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటున్నారు అందులో హీరో హీరోయిన్‌గా నటించిన వరుణ్ ధావన్, సమంత.

ఎక్స్‌కు చేసిన ఖర్చు

ఇందులో భాగంగానే వరుణ్ ధావన్, సమంత కలిసి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలో సమంతను వరుణ్ ధావన్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. వాటిలో ఒకటే "ఇప్పటివరకు నువ్ ఖర్చు చేసినవాటిల్లో పూర్తిగా అత్యంత వృథా ఖర్చు ఏది?" అనే ప్రశ్న. వరుణ్ ధావన్ ఈ ప్రశ్న అడగ్గానే వెంటనే సమంత "నా ఎక్స్‌ (నాగ చైతన్య)కు చేసిన అత్యంత ఖరీదైన గిఫ్ట్స్ ఖర్చు" అని సమాధానం ఇచ్చింది.

ఎంత ఖర్చు పెట్టావ్?

సమంత అని ఎక్స్ అని చెప్పింది నాగ చైతన్య గురించే అని క్లియర్‌గా తెలిసిపోతుంది. అనంతరం సమంత ఇచ్చిన సమాధానానికి "ఎంత ఖర్చు చేసి ఉంటావ్?" అని వరుణ్ ధావన్ అడిగాడు. దానికి "చాలా ఉంటుంది" అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చింది సమంత. తర్వాత "ఒకే వదిలేద్దాం" అని నెక్ట్స్ క్వశ్చన్‌కు వెళ్దాం అన్నట్లుగా సమంత అంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు అవసరమా?

నాగ చైతన్యపై చాలా ఖర్చు పెట్టినట్లు సమంత చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. "శోభిత ధూళిపాళను నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ అవసరమా? స్పందించడం ఎందుకు?" అని అంటున్నారు.

ఎలాంటి గిఫ్ట్స్?

ఇలా శోభిత చైతూ పెళ్లికి రెడీ అవుతున్న సమయంలో సమంత కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. అలాగే, నాగ చైతన్యకు సమంత అంతలా ఏం బహుమతులు ఇచ్చి ఉంటుందా అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే, సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేసిన సిటాడెల్ సిరీస్‌కు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సిరీస్‌లో సమంత యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిందని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

Whats_app_banner