Samantha Citadel Web Series: సమంత సిటాడెల్ వెబ్‌సిరీస్ రిలీజ్‌పై క్లారిటీ - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Samantha Citadel Web Series: సిటాడెల్ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను సమంత నాలుగైదు నెలల క్రితమే పూర్తిచేసింది. కానీ ఇప్పటివరకు ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు.ఈ యాక్షన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందంటే?
Samantha Citadel Web Series: ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను నాలుగైదు నెలల క్రితమే సమంత పూర్తిచేసింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సిటాడెల్ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
సిటాడెల్ వెబ్‌సిరీస్ మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మార్చి నుంచి సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొననున్నట్లు తెలిసింది. సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో సమంతతో పాటు వరుణ్ ధావన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే సిటాడెల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తోన్నాడు. సిటాడెల్ సిరీస్‌లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసింది. కంప్లీట్ యాక్షన్ ప్రధానంగా సమంత రోల్ సాగుతుందని అంటున్నారు. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ వెబ్‌సిరీస్ ఆధారంగా ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ సిరీస్ సాగనుంది.
ఈ ఏడాది ఖుషి
మయోసైటిస్ బారిన పడిన సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నది. ఈ వ్యాధి బారి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిసింది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది తెలుగులో ఖుషి సినిమా చేసింది సమంత. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది