Cabbage vada: టేస్టీ క్యాబేజీ వడలు వేడివేడిగా తింటే రుచి మాములుగా ఉండవు
Cabbage vada: క్యాబేజీ వడలు చూస్తేనే నోరూరి పోతాయి. ఇక్కడ మేము వాటి రెసిపీ ఇచ్చాము. చలికాలంలో వీటిని వండేందుకు ప్రయత్నించండి. చాలా రుచిగా ఉంటాయి.
చలికాలంలో సాయంత్రమైతే వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తాయి. ఇప్పుడు ఒకేలాంటి పకోడీ కాకుండా ఒకసారి క్యాబేజీ వడలు ప్రయత్నించండి. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇందులో వెజిటబుల్స్ కూడా వేసాము. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చాలా సులువుగా చేసేయొచ్చు. వీటిని ఎలా చేయాలో తెలుసుకోండి.
క్యాబేజీ వడలు రెసిపీకి కావలసిన పదార్థాలు
మినప్పప్పు - అరకప్పు
శనగపప్పు - అరకప్పు
క్యాబేజీ తరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక స్పూన్
మిరియాలు పొడి - అర స్పూన్
ఇంగువ - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
క్యాబేజీ వడలు రెసిపీ
1. క్యాబేజీ వడలను వండడానికి ముందుగానే పప్పులను బాగా నానబెట్టుకోవాలి.
2. మినప్పప్పు, శెనగపప్పు కనీసం ఐదు గంటలు నానబెట్టాలి.
3. తర్వాత ఆ నీళ్లను వడకట్టి మిక్సీ జార్లో ఆ పప్పు రెండింటిని కలిపి వేయాలి.
4. అందులోనే జీలకర్ర, అల్లం, ఉప్పు, ఇంగువ, మిరియాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బుకోవాలి.
5. ఆ మొత్తం రుబ్బిన ఒక గిన్నెలో వేయాలి.
6. ఆ గిన్నెలోనే కొత్తిమీర తరుగును, కరివేపాకు తరుగును, క్యాబేజీ తరుగును వేసి బాగా కలుపుకోవాలి.
7. చిటికెడు వంటసోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.
9. అందులో క్యాబేజీ మిశ్రమాన్ని వడల్లాగా ఒత్తి వేసుకోవాలి.
10. రెండు వైపులా రంగు మారేవరకు వేయించి తీసి టిష్యూ పేపర్లో పై ఉంచాలి.
11. ఇది అదనంగా ఉన్న నూనెను పీల్చేసుకుంటుంది.
12. అంతే క్యాబేజీ వడలు రెడీ అయినట్టే.
13. ఈ క్యాబేజీ వడలను కొబ్బరి చట్నీతో తింటే టేస్టీగా ఉంటాయి. సాంబార్‌తో తిన్నా కూడా బావుంటాయి.
క్యాబేజీ పకోడీని క్యాబేజీ ఫ్రై ని అధికంగా చేస్తూ ఉంటారు. క్యాబేజీ వడలను కూడా చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఇవి బాగా నచ్చుతాయి. స్పైసీ గా కావాలనుకుంటే పచ్చిమిర్చి తరుగును ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది.
టాపిక్