Cabbage Kandi Pachadi: నోరు చప్పగా అనిపించినప్పుడు క్యాబేజీ కంది పచ్చడి చేసుకొని చూడండి, స్పైసీగా అదిరిపోతుంది-cabbage kandi pachadi recipe in telugu know how to make this chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cabbage Kandi Pachadi: నోరు చప్పగా అనిపించినప్పుడు క్యాబేజీ కంది పచ్చడి చేసుకొని చూడండి, స్పైసీగా అదిరిపోతుంది

Cabbage Kandi Pachadi: నోరు చప్పగా అనిపించినప్పుడు క్యాబేజీ కంది పచ్చడి చేసుకొని చూడండి, స్పైసీగా అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Aug 12, 2024 11:30 AM IST

Cabbage Kandi Pachadi: తెలుగువారికి పచ్చళ్ళు అంటే ఎంతో ప్రాణం. మీకు నోరు చప్పగా అనిపించినప్పుడు ఓసారి క్యాబేజీ కంది పచ్చడి స్పైసీగా చేసుకుని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.

క్యాబేజీ కంది పచ్చడి
క్యాబేజీ కంది పచ్చడి (Youtube)

Cabbage Kandi Pachadi: తెలుగు వారి భోజనంలో పప్పు, కూర తో పాటు పచ్చడి కూడా ఉండాల్సిందే. చివరిలో పెరుగుతో ముగించాల్సిందే. పచ్చళ్ళు రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. మీకు నోరు చప్పగా అనిపించినప్పుడు ఇక్కడ మేము ఇచ్చిన క్యాబేజీ కంది పచ్చడిని కాస్త స్పైసీగా తిని చూడండి. ఎంత అందమైన తినాలనిపిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు వేడివేడి అన్నంలో క్యాబేజీ కంది పచ్చడి ఒక స్పూను నెయ్యి వేసుకొని తింటే పిల్లలకు కూడా నచ్చడం ఖాయం. అలాగే ఈ పచ్చడిని దోశె, ఇడ్లీ వంటి వాటితో కూడా తినవచ్చు. కోనసీమలో రాజుల భోజనాల్లో ఈ క్యాబేజీ కంది పచ్చడి కనిపిస్తూ ఉంటుంది. వీటిని తయారు చేయడం చాలా సులువు. దీనికి వాడే పదార్థాలన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి ఇది ఆరోగ్యకరమైన రెసిపీ అనే చెప్పాలి.

క్యాబేజీ కంది పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కందిపప్పు - పావు కప్పు

క్యాబేజీ తరుగు - రెండు కప్పులు

ధనియాలు - అర స్పూను

పచ్చిమిర్చి - ఆరు

పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు

వెల్లుల్లి రెబ్బలు - ఐదు

జీలకర్ర - రెండు స్పూన్లు

చింతపండు - నిమ్మకాయ సైజులో

నూనె - తగినంత

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

ఎండు మిర్చి - రెండు

మినప్పప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

క్యాబేజీ కంది పచ్చడి రెసిపీ

1. క్యాబేజీని సన్నగా తరిగి ఆవిరి మీద ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో ధనియాలు, కందిపప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి.

4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసుకోవాలి.

5. ఆ జార్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండును, పచ్చి కొబ్బరిని కూడా వేసేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.

6. ఇక స్టవ్ మీద ఉన్న కళాయిలో మిగిలిన నూనెలో క్యాబేజీ తరుగును వేసి బాగా వేయించుకోవాలి.

7. ఈ క్యాబేజీ వేపుడును చల్లార్చి ముందుగా మిక్సీ పట్టుకున్న కంది పప్పులో వేసుకొని మళ్ళీ మెత్తగా రుబ్బుకోవాలి.

8. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసి వేసుకోవాలి.

9. ఇప్పుడు ఈ పచ్చడికి తాళాంపు వేస్తే టేస్టీగా రెడీ అయిపోతుంది.

10. తాళింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

11. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకులు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి వేయించాలి.

12. ఈ మొత్తం మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ క్యాబేజీ కంది పచ్చడి రెడీ అయినట్టే.

13. ఇది వండుతున్నప్పుడే తినాలన్న కోరికను పెంచేస్తుంది.

14. వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తినండి. మీకు ఎంతో నచ్చుతుంది.

15. మీకు మరింత స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి అధికంగా వేసుకోవాలి.

దీని ఈ క్యాబేజీ కంది పచ్చడి అన్నంలో, ఇడ్లీ, దోశల్లో కూడా తినవచ్చు. కాబట్టి ఒకసారి చేసుకుంటే రోజంతా తాజాగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఈ రెసిపీ ఎంతో మంచిది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారు ఈ రెసిపీని తినవచ్చు. ఇందులో వాడిన పచ్చిమిర్చి నుంచి ధనియాల వరకు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే. క్యాబేజీలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇన్ఫ్మమేషన్ రాకుండా పోరాడుతుంది. క్యాన్సర్ నుంచి కాపాడే లక్షణం కూడా క్యాబేజీకి ఉంది. కాబట్టి పిల్లలకు క్యాబేజీతో చేసిన వంటకాలను తినిపించడం చాలా ముఖ్యం. పెద్దలు కూడా క్యాబేజీని ఇష్టంగా తినాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner