Radhika Merchant: స్నేహితుడి పెళ్లిలో రాధికా మర్చంట్, ఆమె వేసుకున్న డ్రీమ్ పాస్టల్ లెహెంగా ఖరీదెంతో తెలుసా?
Radhika Merchant: స్నేహితుడి పెళ్లిలో రాధికా మర్చంట్ లేత రంగు లెహంగా వేసుకుంది. ఈ డ్రెస్ చూసేందుకు ఎంతో అందంగా ఉంది. లేత రంగులో కూడా లెహెంగాలు అందంగా ఉంటాయని రాధికా మర్చెంట్ నిరూపించింది.
రాధికా మర్చంట్ ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటుంది. ఆమె తన స్నేహితుడి పెళ్లిలో తన అద్భుతమైన ఎథ్నిక్ లుక్స్ తో అందంగా కనిపించింది. అంబానీల చిన్న కోడలు లేత టోన్డ్ లెహంగాలో చూడముచ్చటగా ఉంది. పెళ్లిళ్లలో ముదురు రంగు లెహెంగాలను అధికంగా వేసుకుంటారు. కానీ లేత రంగుల్లో కూడా లెహెంగా అందంగా ఉంటుంది రాధికా మర్చెంట్ నిరూపించింది. ఈ సీజన్లో, అధునాతన మ్యూట్ రంగుల కోసం ముదురు ఎరుపు, గులాబీ రంగులను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రాధికలా అందమైన లేత రంగులను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
మేకప్ ఆర్టిస్ట్ మౌసమ్ గాంధీ ఇటీవల రాధికా మర్చంట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అందులో 'తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి రాధికా మర్చంట్ అంబానీ పాల్గొంది' అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రముఖ డిజైనర్ ద్వయం అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అద్భుతమైన ఎథ్నిక్ దుస్తుల్లో ఆమె పూర్తి గ్లామర్ గా కనిపిస్తోంది.
రాధిక లెహంగా ఐస్ బ్లూ, బేబీ పింక్ రంగుల కలయికలో ఆమె ఎంతో సుందరంగా ఉంది. స్కూప్-నెక్ బ్లౌజ్ ను, సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీతో అలంకరించారు. భారతీయ కళాత్మకతను ప్రతిబింబించేలా ఉంది ఈ లెహెంగా. అద్భుతమైన సీక్విన్స్ పని, ఫ్లేర్డ్ స్కర్ట్ తో ఆమె ఈ డ్రెస్ ను డిజైన్ చేసుకుంది. ఆమె భుజం మీద అందంగా కప్పుకున్న దుపట్టా ఆమె వస్త్రధారణకు పరిపూర్ణ లుక్ ను అందించింది.
డైమండ్ అండ్ ముత్యాల పొదిగిన బ్లౌజ్, స్టెప్స్ లాంటి ముత్యాల నెక్లెస్, సున్నితమైన మంగళ సూత్రం, మ్యాచింగ్ స్టేట్మెంట్ చెవిపోగులు, గాజులు, సొగసైన మాంగ్ టిక్కా, అందమైన ఉంగరాలతో రాధిక తన అందాన్ని మరింతగా పెంచుకుంది.
ఆమె గ్లామర్ మేకప్ లో స్మోకీ ఐషాడో, రెక్కలున్న ఐలైనర్, మస్కారా పూత కనురెప్పలు, విల్లులాంటి కనుబొమ్మలు, ఎర్రటి బుగ్గలు, ప్రకాశవంతమైన హైలైటర్, నిగనిగలాడే పింక్ లిప్ స్టిక్ ఉన్నాయి. సొగసైన బన్ తో హెయిర్ స్టైల్ అదిరిపోయేలా ఉంది. ఇలా హెయిర్ స్టైల్, సింపుల్ లుక్‌తో ఆమె తన ఎథ్నిక్ లుక్ ను పర్ఫెక్ట్ గా పూర్తి చేసింది.
ఆమె వేసుకున్న అందమైన లెహెంగా ఖరీదు కూడా కొన్ని లక్షలు ఉంటుందని కాస్ట్యూమ్ డిజైనర్లు అంచనా వేస్తున్నారు. దీన్ని ప్రత్యేకంగా ఆమె తయారుచేయించింది.
రాధిక మర్చంట్ ఎవరు?
ఎన్కోర్ హెల్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్, షైలా మర్చంట్ల చిన్న కుమార్తె రాధికా మర్చంట్. ఈమె 2024 జూలైలో అనంత్ అంబానీని వివాహం చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన వీరి వివాహ వేడుకలకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.