
కండరాల బలం అంటే కేవలం బరువులు ఎత్తేవాళ్ళకు లేదా క్రీడాకారులకు మాత్రమే అవసరం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కానీ, ఫిట్నెస్ కోచ్ రాజ్ గణ్పథ్ మాత్రం ఈ అభిప్రాయంతో ఏకీభవించట్లేదు. రోజువారీ పనులు చేసుకోవడానికి, అలాగే దీర్ఘకాలిక ఆరోగ్యానికి కండరాలు చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు.



