Kitchen Tips: ఇంట్లో నిల్వ చేసిన కందిపప్పుకు పురుగులు పట్టకూడదంటే ఇలా చేయండి!
Pulses Storage Tips: ఇంట్లో నిల్వ చేసిన పప్పుధాన్యాలకు పరుగులు పట్టే ప్రమాదం ఉంటుంది. పురుగు పడితే కంది, శనగ లాంటి పప్పులు వాడేందుకు బాగోవు. కొన్ని మార్గాల ద్వారా పప్పులకు పురుగు పట్టకుండా చేయవచ్చు.
కందిపప్పు, శనగపప్పు సహా మరికొన్ని పప్పుధాన్యాలను ఇళ్లలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రతీ రోజు వంటల్లో వాడుతుంటారు. అందుకే చాలా మంది ఎక్కువ మొత్తంలో కొనుక్కొని తెచ్చుకుంటుంటారు. ఇళ్లలో నిల్వ చేసుకుంటారు. అయితే, నిల్వ చేసిన పప్పుధాన్యాలకు పరుగులు పట్టే ప్రమాదం ఉంటుంది. పరుగులు పడితే పప్పులు వండేందుకు సరిగా ఉండవు. పురుగులను తొలగించడం కష్టంగా ఉంటుంది. అయితే, నిల్వ చేసిన పప్పుధాన్యాలకు పరుగులు పట్టకుండా కొన్ని మార్గాలు పాటించవచ్చు. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
వేపాకులు
పప్పుధాన్యాలకు పురుగు పట్టకుండా వేపాకు చేయగలదు. కొన్ని వేపాకులకు కాస్త ఆరబెట్టి తేమ పోయాక.. పప్పు ఉన్న డబ్బాలో వేయాలి. వేపాకులో పరుగులను నిరోధించే గుణం సహజంగా ఉంటుంది. దీనివల్ల పప్పుకు పరుగులు పట్టకుండా చేయగలదు.
లవంగాలు
లవంగాలు కూడా పప్పులకు పురుగులు పట్టకుండా నిరోధించగలవు. లవంగాల్లోని ఘాటైన గుణం ఇందుకు సహకరిస్తుంది. పప్పుధాన్యాలు ఉన్న డబ్బాలో సుమారు 10 వరకు లవంగాలు వేసుకోవాలి. పురుగుల నిరోధించడంతో పాటు పప్పులను తాజాగా కూడా ఉంచేందుకు లవంగాలు తోడ్పడతాయి.
వెల్లుల్లి
వెల్లుల్లి కూడా పరుగులను నివారిస్తుంది. పప్పుధాన్యాలు ఉంచుకున్న డబ్బాలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేయాలి. ఓ మోస్తరు డబ్బాలో సుమారు 5 రెబ్బలను వేసుకోవాలి. వేసిన వెల్లుల్లి ఎండిపోతే వాటి స్థానంలో వేరేవి వేసుకోవాలి.
ఎండుమిర్చి
పప్పుధాన్యాలకు పురుగుల బెడదను ఎండుమిర్చి కూడా తగ్గించగలదు. నిల్వ చేసుకున్న పప్పుల్లో ఎండుమిర్చిని అలాగే వేస్తే పరుగులు పట్టే రిస్క్ తగ్గిపోతుంది.
పరుగులను నిరోధించే బిల్లలు
పప్పు ధాన్యాలకు పురుగులు పట్టకుండా ఉండేందుకు కొన్ని రకాల బిల్లలు మార్కెట్‍లో దొరుకుతాయి. కిరాణా షాపుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఇవి చూడడానికి మాత్రల్లా ఉంటాయి. వీటిని పప్పు ఉన్న డబ్బాలో వేసుకోవాలి. అయితే, ఆ మాత్రలను వేటితో తయారు చేశారో కనుక్కొని తీసుకోవాలి.
ఎండ పెట్టాలి
ఒకవేళ అప్పటికే పరుగులు పడితే పప్పుధాన్యాలను ఎండకు ఆరేయాలి. ఓ క్లాత్ పరిచి దానిపై ధాన్యాన్ని పోసుకోవాలి. నేరుగా ఎండ తగిలేలా ధాన్యాన్ని క్లాత్‍పై ఆరేయాలి. దీనివల్ల పురుగులు తొలగిపోతాయి. ఒకవేళ ఎక్కువ రోజులు పప్పుధాన్యాలను నిల్వ చేయాల్సి వస్తే.. పరుగులు లేకపోయినా నెలకు ఓసారి ఎండలో ఆరేయడం మేలు. దీనివల్ల పప్పుల్లో ఏదైనా తేమ ఉన్నా ఆరిపోతుంది.
టాపిక్