AP Transco Jobs: ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ లాయర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, జీతం రూ.1.20లక్షలు…-ap transco corporate lawyer jobs notification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Transco Jobs: ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ లాయర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, జీతం రూ.1.20లక్షలు…

AP Transco Jobs: ఏపీ ట్రాన్స్‌కో కార్పొరేట్‌ లాయర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, జీతం రూ.1.20లక్షలు…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 25, 2024 01:43 PM IST

AP Transco Jobs: ఏపీ ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఐదు పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బి కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు
ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు

AP Transco Jobs: ఏపీ ట్రాన్స్‌ కోలో కార్పొరేట్ లాయర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కార్పొరేట్‌ లాయర్‌ పోస్టులకు భర్తీ చేసే వారు కనీసం నాలుగేళ్ల అనుభవం కలిగి ఉండాలి. షార్ట్‌ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి రూ.1.20లక్షల వేతనం చెల్లిస్తారు.

కార్పొరేట్‌ లాయర్‌గా ఎంపికైన వారు విజయవాడ విద్యుత్‌సౌధలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌కో కు సంబంధించిన ఒప్పందాల రూపకల్పన, లీగల్ కేసులు పరిశీలించడం, రిమార్కుల రూపకల్పన, హైకోర్టు న్యాయవాదులతో చర్చించడం,అధికారుల ఆదేశాల మేరకు లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని పోస్టులు విజయవాడలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తులను నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లో ట్రాన్స్‌కో ఛైర్మన్‌/ఎండీలకు చేరేలా పంపాల్సి ఉంటుంది.

నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తుతో పాటు అటెస్టెడ్‌ కాపీలు, రెజ్యుమ్‌, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే దరఖాస్తులు ప్రొపర్ ఛానల్‌లో పంపాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు డిసెంబర్‌ 10, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్‌కో పోస్టులు ఒకటి, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులు నాలుగు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ.1,20,000 వరకు చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్‌ 19, 2024వ తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..

The Chairman and Managing Director, APTRANSCO, Vidyut Soudha, Gunadala, Vijayawada -520004.

Whats_app_banner