Andhra Pradesh News Live November 25, 2024: AP Graduate Electoral Rolls :ఏపీ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ జాబితా విడుదల- మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 25 Nov 202404:20 PM IST
AP Teachers Graduate Electoral Rolls : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలతో ఓటర్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Mon, 25 Nov 202401:57 PM IST
Visakhapatnam Glass Skywalk Bridge : విశాఖలో మరో టూరిస్ట్ అట్రాక్షన్ రాబోతుంది. కైలాసగిరి వద్ద టైటానిక్ వ్యూ పాయింట్ వద్ద కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. రూ.6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది.
Mon, 25 Nov 202412:11 PM IST
- AP Govt : కొత్త రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అలాగే కరెక్షన్ కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు. అలాంటి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీని పూర్తి చేస్తామని వెల్లడించింది. దరఖాస్తు ప్రక్రియ గురించి అధికారులు వెల్లడించారు.
Mon, 25 Nov 202411:37 AM IST
AP Farm Fund Scheme : ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ ద్వారా రైతులకు రూ.75 వేల సబ్సిడీ అందిస్తుంది. కరువు పీడిత ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగులో నీటి కొతర సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు.
Mon, 25 Nov 202411:01 AM IST
- Nellore : ప్రియుడుని పిలిచి బంగారు ఆభరణాలను దోచేసింది ఓ ప్రియురాలు. ఆపై ఒక హోటల్‌లో బంధించి, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ఈ ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చకెక్కింది. ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.
Mon, 25 Nov 202410:13 AM IST
AP Heavy Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం పుదుచ్చేరికి 980 కి.మీ, చెన్నైకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Mon, 25 Nov 202409:17 AM IST
Balineni Vs Chevireddy : విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. అర్ధరాత్రి నిద్ర లేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారని మాజీ మంత్రి బాలినేని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం జగన్ పై అభాండాలు వేస్తున్నారని బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్ అయ్యారు.
Mon, 25 Nov 202408:27 AM IST
Revenue Sadassulu : భూముల రీసర్వే సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ సభల్లో స్వీకరించిన ఫిర్యాదులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Mon, 25 Nov 202408:26 AM IST
- APSRTC Package: పుణ్యక్షేత్రాల యాత్ర చేసే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలకు స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Mon, 25 Nov 202408:13 AM IST
- AP Transco Jobs: ఏపీ ట్రాన్స్‌కోలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఐదు పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బి కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
Mon, 25 Nov 202408:06 AM IST
- Tirupati : తిరుపతిలో దారుణం జరిగింది. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే అమ్మనాన్నల్ని చంపేస్తానని బెదించాడు. బాలికకు జ్వరం, కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రి తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది.
Mon, 25 Nov 202406:17 AM IST
- RGV Issue: సోషల్ మీడియా పోస్టులపై హైదరాబాద్‌లోని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోలీసులు రావడానికి ముందు వర్మ అదృశ్యమైపోయారు.
Mon, 25 Nov 202405:35 AM IST
- Visakhapatnam : వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. చాలా రూట్లలో బాగా డిమాండ్ ఉంది. కానీ.. విశాఖపట్నం- దుర్గ్ మధ్య నడిచే ట్రైన్‌కు డిమాండ్ నామమాత్రంగా కూడా లేదు. దీంతో ఈ రైలు నిత్యం ఖాళీగా దర్శనమిస్తోంది. దీంతో డిమాండ్ లేని రూట్‌లో ఎందుకు.. వేరే మార్గంలో నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Mon, 25 Nov 202404:23 AM IST
- AP Cable War: విజయవాడలో మరోసారి కేబుల్ వార్ పతాక స్థాయికి చేరింది.కేబుల్ వైర్లు కత్తిరించడం, బెదిరింపులు, దాడులతో పోలీస్‌కేసులు,కోర్టు పిటిషన్లు దాఖలవుతున్నాయి. కేబుల్ వ్యాపారం కాసులు కురిపిస్తుండటంతో దానిని దక్కించుకునే క్రమంలో ఆధిపత్యపోరు మొదలైంది.ఇది ఎక్కడకు దారి తీస్తుందోననే ఆందోళన నెలకొంది.
Mon, 25 Nov 202401:52 AM IST
- Suicide in Bus: తిరుపతిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న యువకుడు బస్సు సీలింగ్ రాడ్డుకు ఉరేసుకున్నాడు. బస్సుల్లో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎవరు గుర్తించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon, 25 Nov 202412:47 AM IST
- Vizag Railwayzone: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ వైజాగ్ రైల్వే జోన్ సాకారం కానుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం టెండరును పిలిచారు. డిసెంబర్ 2న ప్రీ బిడ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 13 నుంచి బిడ్డింగ్ ప్రారంభం కానుంది.