చలికాలంలో జలుబు, తుమ్ములు సహజం. చలికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి 6 ముఖ్యమైన చిట్కాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Nov 25, 2024
Hindustan Times Telugu
చలికాలంలో ఉష్ణోగ్రతల తగ్గుదలతో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిల్లో జలుబు, సీజనల్ ఫ్లూలు ముందు వరుసలో ఉంటాయి. శీతాకాలంలో మీ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వీటిని ప్రయత్నించండి.
pexels
నట్స్, సూపర్ సీడ్స్ - నట్స్, సూపర్ సీడ్స్ ఆరోగ్యకరమైనవి. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు మూలం. వీటిని తరచుగా తీసుకోవడం రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
pexels
తేనె - తేనెలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబును ఎదుర్కొనేందుకు ఇది సహాయపడుతుంది.
హెర్బల్ టీ - అల్లం, చమోమిలే, పెప్పర్ వంటి హెర్బల్ టీ చలికాలంలో మిమల్ని వెచ్చగా ఉంచుతుంది. సీజనల్ ఫ్లూను ఎదుర్కోవటానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
నీళ్లు తాగడం - చలికాలంలో నీళ్లు తక్కువగా తాగుతుంటాం. ఒక్కొసారి నీళ్లు తాగడం కూడా మర్చిపోతుంటాం. వేసవిలో చెమట పట్టడం వల్ల దాహం వేస్తుంది. చలికాలంలో అంతగా దాహం వెయ్యదు. అయితే శరీరానికి అవసరమైన నీరు అందించడం మార్చిపోకూడదు. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
గ్రీన్ టీ- గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఎపిగల్లోకాటెచిన్ గాలెట్ రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది.
pexels
నెయ్యి -చలికాలంలో మీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోండి. నెయ్యి మీ శరీరంలో వేడిని పెంచుతుంది. విటమిన్లు A, D, E, K లకు నెయ్యి మంచి మూలం.