మెదడువాపు వ్యాధికి కారణమయ్యే ఆర్బో వైరస్ జాతికి చెందిన డెంగు వైరస్ ఏడిస్ ఈజిప్టై దోమల వల్ల సంక్రమిస్తుంది.
By Bolleddu Sarath Chandra Nov 25, 2024
Hindustan Times Telugu
డెంగ్యూ జ్వరాన్ని ఏడిస్ జ్వరం, బోగట్ జ్వరం, బ్రేక్‌డోన్ జ్వరం, డాండీ జ్వరం, సోలార్ జ్వరం, స్టిఫ్‌నెక్ జ్వరం అనే పేర్లు ఉన్నాయి
డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమ పగటిసమయంలో మాత్రమే కుడుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏటా 5-10కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. ఆగస్ట్-నవంబర్ మధ్య కాలంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి.
డెంగ్యూ మొదటి దశలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, నుదుటి మధ్యలో నొప్పి, కనుగుడ్ల వెనుక నొప్పి, గొంతు నొప్పి, కీళ్లు, కండరాల్లో తీవ్రమైన నొప్పి, చర్మంపై పొక్కులు, ఆకలి మందగించడం,రుచి తెలియకపోవడం, మలబద్దకం, వాంతులు, వికారం, నీరసం మొదలైన లక్షణాలు ఉంటాయి.
డెంగ్యూ రెండో దశలో చిగుళ్ల నుంచి రక్తం కారడం, నుదుటి మధ్యలో నొప్పి, కనుగుడ్ల వెనుక నొప్పి, గొంతు నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి.
డెంగ్యూ వల్ల తెల్ల రక్త కణాలలో ప్లేట్‌లెట్స్ తగ్గడం వంటి ప్రమాదకరమైన లక్షణాలు ఉంటాయి. జ్వరం మొదట్లో రెండు మూడు రోజులు తగ్గినా మళ్లీ తీవ్రం అవుతుంది. జ్వరం తగ్గుతున్న దశలో ముఖంపై, కాళ్లమీద, ఛాతీపై ఎర్రని దద్దుర్లు రక్తం కుదుము కట్టినట్టు కనిపిస్తుంది.
సకాలంలో గుర్తించకపోతే పొట్టలో, మెదడులో రక్తస్రావమై ప్రాణాపాయం సంభవించవచ్చు. మూడో దశలో అపస్మారక స్థితికి చేరుకోవచ్చు
డెంగ్యూను సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోయి మరణానికి చేరువయ్యే ప్రమాదం ఉంటుంది.
చలికాలంలో పాలల్లో పసుపు కలిపి తాగితే ఎన్ని లాభాలో తెలుసా?