Crime Thriller OTT: ఓటీటీలోకి వంద కోట్ల టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Crime Thriller OTT: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.
Crime Thriller OTT: దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ సోమవారం కన్ఫామ్ అయ్యింది. నవంబర్ 28 న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
మీనాక్షి చౌదరి హీరోయిన్...
పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. రాంకీ, సర్వదామన్ బెనర్జీ, సాయికుమార్, టీనూ ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు.
వంద కోట్ల కలెక్షన్స్...
అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో లక్కీ భాస్కర్ మూవీ రిలీజైంది. 35 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. మలయాళంలో 22 కోట్లు, తమిళంలో 16 కోట్లు, కన్నడంలో ఆరున్నర కోట్ల వరకు కలెక్షన్స్‌ను సొంతం చేసుకున్నది. ఓవర్‌సీస్‌లో 5 కోట్లకుపైగా ఈ మూవీకి కలెక్షన్స్ వచ్చాయి.ఈ ఏడాది టాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
లక్కీ భాస్కర్ కథ ఇదే...
భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి. కుటుంబ బాధ్యతల కారణంగా అప్పుల పాలవుతాడు. డబ్బు కోసం ఆంటోనీ ( రాంకీ) అనే వ్యక్తితో చేతులు కలిపి అక్రమ డీల్స్‌తో కోట్లు సంపాదిస్తాడు. హర్షద్ మెహతా బ్యాంకు స్కాములో భాగం అవుతాడు. అతడి బ్యాంకు ఖాతాలో వంద కోట్ల డబ్బు జమ అవుతుంది. భాస్కర్ చేస్తోన్న స్కాములు ఎలా బయటపడ్డాయి? డబ్బు సంపాదనలో పడి కుటుంబాన్ని భాస్కర్ ఎలా నిర్లక్ష్యం చేశాడు?భాస్కర్‌తో భార్య సుమతి (మీనాక్షి చౌదరి) ఎందుకు గొడవపడింది? ఈ స్కాముల నుంచి భాస్కర్ బయటపడ్డాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
హ్యాట్రిక్ హిట్...
మహానటి, సీతారామం తర్వాత లక్కీ భాస్కర్‌తో తెలుగులో హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో కాంతతో పాటు ఆకాశంలో ఒక తార సినిమాలు చేస్తోన్నాడు. కొన్నాళ్లుగా మలయాళం సినిమాలకు దూరంగా ఉంటోన్న దుల్కర్ సల్మాన్ టాలీవుడ్‌పై ఫోకస్ పెడుతోన్నాడు. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలను అందకుంటోన్నాడు.