Bigg Boss Telugu 8: కిలోలు కాదు టన్నుల్లో ఇస్తా ఫైర్- నామినేషన్స్‌లో నబీల్, పృథ్వీకి ఇచ్చిపడేసిన గౌతమ్, అవినాష్ (వీడియో)
Bigg Boss Telugu 8 13th Week Nominations Highlights: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగాయి. దీనికి సంబంధించిన బిగ్ బాస్ 8 తెలుగు నవంబర్ 25 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో నబీల్‌కు గౌతమ్, పృథ్వీకి అవినాష్ నోట మాటరాకుండా ఇచ్చి పడేశారు.
Bigg Boss 8 Telugu This Week Nomination Highlights: బిగ్ బాస్ తెలుగు 8 పదమూడో వారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. గొడవలు, వాగ్వాదాలతో మరింత రచ్చ రచ్చగా బిగ్ బాస్ 8 తెలుగు 13వ వారం నామినేషన్స్ జరిగినట్లు ప్రోమో వీడియో చూస్తుంటే తెలుస్తోంది.
ఇద్దరిని నామినేట్ చేయాలి
తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 నవంబర్ 25 ఎపిసోడ్ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో "మీరు ఎవరినైతే ఫైనలిస్ట్‌గా చూడకూడదనుకుంటున్నారో.. ఎవరి ప్రయాణాన్ని అయితే ముందుకు సాగకుండా ముగిద్దామని అనుకుంటున్నారో ఆ ఇద్దరి సభ్యులను తగిన కారణాలు చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది" అని బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు.
"వైల్డ్ కార్డ్స్‌ను పంపించేద్దామని తెచ్చిన పాయింట్ నాకు నచ్చలేదు" అని గౌతమ్‌ను నామినేట్ చేస్తూ నబీల్ అన్నాడు. "నామినేషన్స్‌లోకి తీసుకొచ్చి ఎవడిని నామినేట్ చేయలేదు" అని గౌతమ్ చెబుతుంటే.. ఇంకా మాట్లాడొచ్చు అని నబీల్ అన్నాడు. "నన్ను పూర్తి చేయనివ్వు. నువ్వెందుకు మధ్యలో వస్తున్నావ్" అని గౌతమ్ అన్నాడు. దాంతో నబీల్ సైలెంట్ అయిపోయాడు.
ఆ హక్కు లేదు నీకు
తర్వాత "ఎక్కడ మాట్లాడబుద్ధి అయితే అక్కడ మాట్లాడతా" అని నబీల్ అంటే.. "నేను కూడా అంతే కదా" అని గౌతమ్ అన్నాడు. "నా వరకు తప్పు అనిపించింది నిర్ణయిస్తా" అని నబీల్ అన్నాడు. "నా వాక్కు నా హక్కు. అది నువ్ మాట్లాడొద్దు అనడానికి నీకు హక్కు లేదు" అని గౌతమ్ అన్నాడు. దాంతో ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు నబీల్.
తర్వాత అవినాష్‌ను పృథ్వీ నామినేట్ చేశాడు. "విష్ణు, రోహిణి మధ్య గొడవ జరిగినప్పుడు మీరు మధ్యలో లేచి వచ్చారు. అమ్మాయి మ్యాటర్ నాకెందుకు అని చెప్పారు అక్కడ" అని పృథ్వీ అన్నాడు. "వర్క్ విషయంలో ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేస్తాను. పర్సనల్ విషయాల్లో నేను ఇన్వాల్వ్ కానని చెప్పాను. అది పర్సనల్ విషయం" అని అవినాష్ వివరణ ఇచ్చుకున్నాడు.
రివర్స్‌లో అందుకున్న అవినాష్
దాంతో "ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కటే చూపిస్తున్నారు. గేమ్ ఆడట్లేదు" అన్నట్లుగా అని పృథ్వీ అన్నాడు. "ఏడు వారాల నుంచి రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఓకే. నేను ఏ గేమ్ ఆడలేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాను. పన్నెండు వారాలు నువ్వున్నావ్. మెగా చీఫ్ అయ్యావ్" ఒకే అని రివర్స్‌లో అందుకున్నాడు అవినాష్. దాంతో పృథ్వీకి నోట మాట రాలేదు.
"ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏంటీ చెప్పు" అని అవినాష్ అడిగితే "బిగ్ బాస్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్" అని పృథ్వీ అన్నాడు. "ఎంటర్‌టైన్‌మెంట్ ఒక్కటే అంటున్నావ్. అన్ని చేస్తున్న కదా మరి" అని అవినాష్ అన్నాడు. దాంతో పృథ్వీ బిత్తరపోయి చూశాడు. తర్వాత "నామినేషన్స్‌లో తప్పా గేమ్‌లో నీ ఫైర్ కనిపించట్లేదు" అని గౌతమ్‌ను నబీల్ అన్నాడు.
బొరాన్ బొరాన్ ఉంటది
"ఫైర్ లేకుంటేనే ఇన్నిరోజులు నేను నిలదొక్కుకుంటూ వచ్చానా" అని గౌతమ్ అన్నాడు. "నబీల్‌లో ఫైర్ ఉంది కాబట్టే ఇన్ని వారాలు ఉన్నాడు" అని నబీల్ అన్నాడు. "గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది" అని గౌతమ్ అంటే నబీల్ ఎప్పుడు చేసినట్లే అరిచాడు. తర్వాత లక్కు వల్ల గెలిచే వాళ్లు నాకు ఇక్కడ ఉండటం ఇష్టంలేదని పృథ్వీ అంటే ఏడు వారాలు గేమ్ ఆడాను రెండు సార్లు మెగా చీఫ్ అయ్యాను అని అవినాష్ తొడ కొట్టాడు.
"నబీల్ నీకు షీల్డ్ ఇచ్చి" అని పృథ్వీ అంటే "నబీల్ నేను నిన్ను అడిగానా" అని అవినాష్ అన్నాడు. దాంతో అడగలేదు అన్నట్లుగా నబీల్ తల ఊపాడు. తర్వాత "నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ బొరాన్ ఉంటది మొత్తం" అని నబీల్ అన్నాడు. "గ్రాములు, కిలోల లెక్కన కాదు టన్నులు టన్నులు లెక్కన ఇస్తా ఫైర్" అని గౌతమ్ మాస్‌గా డైలాగ్ కొట్టాడు. ఇలా నబీల్‌కు గౌతమ్, పృథ్వీకి అవినాష్ సరిగ్గా డిఫెండ్ చేసుకుని ఇచ్చిపడేశారు.