Maruti Alto : తక్కువ బరువుతో, 30 కి.మీ మైలేజీతో రానున్న కొత్త ఆల్టో కారు.. ధర కూడా అందుబాటులోనే!
New Generation Maruti Alto : మారుతి ఆల్టోకు మార్కెట్‌లో తిరుగులేదు. ఈ కారు కొత్త అవతారంలో మార్కెట్‌లోకి రానుంది. సుజుకి 10వ జనరేషన్ ఆల్టో కారు అప్‌డేటెడ్ వెర్షన్‌లో విడుదల కానుంది.
మారుతి సుజుకి ఆల్టో కారు అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయి. ఇది ప్రముఖ హ్యాచ్‌బ్యాక్, అధిక సంఖ్యలో కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. 9వ జనరేషన్ ఆల్టో కారు 2021లో విడుదలైంది. ప్రస్తుతం ఈ కారు బాగా అమ్ముడవుతోంది. తర్వాత పదో జనరేషన్ కారు కూడా వచ్చింది. ఇప్పుడు సుజుకి 10వ జనరేషన్ ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను అప్‌డేట్స్‌తో 2026లో పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సుజుకి ఆల్టో కారు దశాబ్దాలుగా ప్రజాదరణ పొందింది. 1979లో జపాన్‌లో ప్రారంభించారు. తర్వాత 2000లో మారుతి సుజుకి కొత్త ఆల్టో హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఇష్టమైన కారు ఇది. జపాన్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఆల్టో బరువు 680 నుంచి 760 కిలోలు. 10వ జనరేషన్ ఆల్టో కారు.. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేస్తున్నారని తెలుస్తోంది. 100 కిలోల బరువు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారు దాదాపు 580 నుంచి 660 కిలోల బరువు ఉంటుందని అంటున్నారు.
రాబోయే సుజుకి ఆల్టో శక్తివంతమైన 48V మైల్డ్ హైబ్రిడ్ (పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్) ఇంజన్‌తో అందించబడుతుందని చెబుతున్నారు. ఇది 30 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుందని అంచనా. సాధారణంగా ఆల్టో హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ వేరియంట్ 25.2 కేఎంపీఎల్ మైలేజీని, మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ 27.7 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది.
జపాన్ మార్కెట్‌లో సుజుకి ఆల్టో, పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.83 లక్షల వరకు ఉంటుంది. మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ ధర రూ. 6.65 లక్షలుగా ఉందని తెలుస్తోంది.
దేశీయ విపణిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న సరికొత్త ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 3.99 లక్షల నుండి రూ. 5.51 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉంటుంది. పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 24.39 నుండి 33.85 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది.
కొత్త మారుతి ఆల్టో కారు రూ.5.45 లక్షల ధరతో రావొచ్చని అంచనా. ఈ కారు ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ ప్లస్‌లతో సహా వివిధ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. ఇది మెటాలిక్ సిజ్లింగ్ రెడ్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, మెటాలిక్ గ్రానైట్ గ్రేతో సహా అనేక రకాల కలర్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఇందులో నలుగురు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఇది 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.
10వ జనరేషన్ సుజుకి కొత్త ఆల్టో హ్యాచ్‌బ్యాక్ 2026లో జపనీస్ మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. తరువాత భారత్‌లోకి కూడా రావొచ్చు. ఇది చాలా తక్కువ ధర, మంచి ఫీచర్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. చిన్న కుటుంబానికి బాగుంటుంది.