APSRTC Package: భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం నుంచి పంచ వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు..-rtc good news for devotees special buses from visakhapatnam for pancha vaishnava kshetra darshini ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc Package: భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం నుంచి పంచ వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు..

APSRTC Package: భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌, విశాఖ‌ప‌ట్నం నుంచి పంచ వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు..

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 25, 2024 01:56 PM IST

APSRTC Package: పుణ్య‌క్షేత్రాల యాత్ర చేసే భక్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) పంచ వైష్ణవ క్షేత్ర ద‌ర్శిని పేరుతో పుణ్య‌క్షేత్రాలకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏపీఎస్‌ఆర్టీసీ పుణ్య క్షేత్ర సర్వీసులు
ఏపీఎస్‌ఆర్టీసీ పుణ్య క్షేత్ర సర్వీసులు

APSRTC Package: విశాఖ‌ప‌ట్నం నుంచి రాష్ట్రంలోని ఐదు వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నానికి ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్ స‌ర్వీస్‌లను ఏర్పాటు చేసింది. ఈ స‌ర్వీస్‌ల‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని ఏపీఎస్ ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ బి.అప్ప‌ల‌నాయుడు కోరారు.

ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను, ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తుంది. డిమాండ్‌ను బ‌ట్టీ, ప్ర‌యాణీకులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని ఆర్టీసీ అందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణ‌వ ఆల‌యాల ద‌ర్శ‌నానికి ఈ బస్సు స‌ర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చింది.

ఏఏ తేదీల్లో స‌ర్వీసులు

మార్గ‌శిర మాసంలో పంచ వైష్ణ‌వ క్షేత్ర‌ద‌ర్శిన పేరుతో డిసెంబ‌ర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్ర‌త్యేక స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయా తేదీల్లో విశాఖ‌ప‌ట్నం ద్వారకా బ‌స్‌స్టేష‌న్ నుంచి రాత్రి 9 గంట‌ల‌కు బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి.

ఐదు వైష్ణ‌వ ఆల‌యాల సంద‌ర్శ‌న‌

తొలిత ద్వార‌కా తిరుమ‌లలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ నుంచి అంత‌ర్వేది చేరుకొని అక్క‌డ‌ శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ద‌ర్శించుకుంటారు. ఆ త‌రువాత అప్ప‌న‌ప‌ల్లి చేరుకుని, అక్క‌డ శ్రీబాల బాల‌జీ స్వామిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డ నుంచి గొల్ల‌లమామిడాడ చేరుకుని కోదండ రామాల‌యాన్ని ద‌ర్శించుకుంటారు. త‌రువాత అన్న‌వ‌రం చేరుకుని అక్క‌డ‌ శ్రీ వీర వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ స్వామిని ద‌ర్శనం చేసుకుంటారు. అక్క‌డ నుంచి విశాఖ‌ప‌ట్నం చేరుకుంటారు.

ప్యాకేజీ ఇదే

సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల‌కు ఒక్కో టికెట్ ధ‌ర రూ.1,800లుగా నిర్ణ‌యించారు. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో https://www.apsrtconline.in/oprs-web/services/packagetours.do బుక్ చేసుకోవ‌చ్చు. లేక‌పోతే విశాఖ‌ప‌ట్నం ద్వారకా బ‌స్‌స్టేష‌న్‌లో పొంద‌వ‌చ్చు. ఇత‌ర వివ‌రాల కోసం 9959225602, 9052227083, 99592 25594, 9100109731 ఫోన్ నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌ని ఆర్టీసీ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ బి. అప్ప‌ల‌నాయుడు తెలిపారు.

డిసెంబ‌ర్ 1న పంచారామ క్షేత్రాల‌కు చివ‌రి స‌ర్వీస్‌

డిసెంబ‌ర్ 1 తేదీన పంచారామ క్షేత్రాల ద‌ర్శినానికి బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. బస్సులు ద్వారకా బస్సు కాంప్లెక్స్ నుండి బయలుదేరి పంచారామాలైన అమ‌రావ‌తి (అమ‌రేశ్వ‌రుడు), భీమ‌వ‌రం (సోమేశ్వ‌రుడు), పాల‌కొల్లు (క్షీర‌రామ‌లింగేశ్వ‌రుడు), ద్రాక్షారామం (భీమేశ్వ‌రుడు), సామ‌ర్ల‌కోట (కొమ‌ర లింగేశ్వ‌రుడు) పుణ్య‌క్షేత్రాల‌ను సోమ‌వారం నాడు ద‌ర్శనం పూర్తి చేసుకుంటారు. అనంత‌రం మ‌ళ్లీ తిరిగి సోమవారం రాత్రికి ద్వారకా కాంప్లెక్స్‌కు బ‌స్సులు చేరుకుంటాయని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 35 బ‌స్సులు పంచారరామాల‌కు న‌డిపామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 1 తేదీన న‌డిపి స‌ర్వీసులే చివ‌రివ‌ని పేర్కొన్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner