Heart Attack: వామ్మో ఆ కారణం వల్ల కూడా గుండె పోటు కేసులు పెరిగిపోతున్నాయిట, ప్రతిఒక్కరూ జాగ్రత్త పడాలి
Heart Attack: రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా మారుతోంది. ఫిట్ నెస్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలో అయ్యే వారికి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, కాలుష్యంలో గుండెను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి.
వాతావరణంలో కాలుష్యం స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్యం సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. పూర్తిగా ఫిట్ గా ఉన్న వారికి కూడా కాలుష్యం కారణంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చాలా మందికి అలెర్జీలు, జలుబు, దగ్గు, టాన్సిల్స్ నొప్పి రావడ వంటి సమస్యలు వస్తున్నాయి. మరికొందరికి శ్వాసకోశ వ్యాధులు కూడా వస్తున్నాయి. కేవలం ఇలాంటి రోగాలే కాదు, కాలుష్యం అనేది కొన్నిసార్లు గుండె పోటుకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంది. అంతకంతకూ పెరుగుతున్న కాలుష్య కారకాలు గుండె సమస్యలతో బాధపడేవారికి ఇబ్బందిని కలిగిస్తాయి. గాలి కాలుష్యంలో మీ గుండెను సురక్షితంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి.
రక్తపోటు వల్లే గుండె సమస్యలు
పెరుగుతున్న కాలుష్యం వల్ల రక్తపోటు పెరిగిపోతుంది. ఎప్పుడైతే రక్తపోటు పెరిగిందో గుండెపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల, పొగమంచు ఉన్న రోజుల్లో మీ రక్తపోటును ఎప్పటికప్పుడు చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు చలికాలంలో చాాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు పెరిగినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా వైద్యులు గుండెను కాపాడతారు.
చలికాలంలో తినాల్సిన కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినడం ద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతునివ్వాలి. వీటిని తినడం వల్ల శరీరంపై కాలుష్యం ప్రభావం తగ్గుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
మీకు అధిక అలసటగా అనిపించినా, ఛాతీ నొప్పి రావడం, హృదయ స్పందన సరిగా లేకపోవడం వంటి లక్షణాలను అనుభవిస్తే, డాక్టర్ సలహా తర్వాత ఇసిజి పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష తరువాత, ఇది గుండె సంబంధిత సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కాలుష్యం ఉన్న రోజులకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.
మాస్క్ ధరించండి
మాస్క్ అనేది కేవలం కరోనా సమయంలో వాడేదే అనుకోకండి. గాలి కాలుష్యాన్ని అడ్డుకోవడానికి దీన్ని ఇప్పటికీ వాడవచ్చు. చలి ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి స్వచ్ఛంగా లేనప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు సిటీల్లో గాలి కాలుష్యం ఎక్కువగానే ఉంది. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు మీ ముక్కు, నోటిని మాస్క్ తో పూర్తిగా కవర్ చేయండి. అయితే మాస్క్ తరచు ఉతుకుతూ ఉండాలి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఎక్కువ కాలుష్యం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి. అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు వెళ్లాలి. మీరు ఈ చెడు గాలిని ఎంత ఎక్కువగా నివారించినట్లయితే, హానికరమైన కణాలు శరీరంలో చేరే ప్రమాదం తగ్గుతుంది. ఈ కణాలు గుండె మరియు ధమనులపై ఒత్తిడిని కలిగిస్తాయి.