Heart Attack: చలికాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?-why is heart attack risk more in winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack: చలికాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

Heart Attack: చలికాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2024 08:30 AM IST

Heart Attack: చలికాలంలో వాతావరణం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు కలుగుతాయి. గుండెపై కూడా ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలో గుండె పోటు రిస్క్ పెరుగుతుంది. ఎందుకో ఇక్కడ చూడండి.

Heart Attack: చలికాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?
Heart Attack: చలికాలంలో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది?

చలికాలం మొదలైపోయింది. ఇప్పటికే క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ.. క్రమంగా చలితీవ్రత పెరిగిపోతుంది. ఆరోగ్యంపై శీతాకాలం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులతో పాటు గుండె ఆరోగ్యంపై కూడా చలికాలంలో ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో గుండె పోటు రిస్క్ పెరుగుతుంది. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అప్పటికే గుండె వ్యాధులతో ఉన్న వారికి ఈ కాలంలో హార్ట్ అటాక్ రిస్క్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది. అందుకు కారణాలు ఏంటంటే..

రక్త నాళాల సంకోచంతో..

శీతాకాలంలో శరీరంపై చల్లటి వాతావణం ఎఫెక్ట్ పడుతుంది. శరీరానికి తగినంత రక్త సరఫరా చేసేందుకు, వెచ్చదనంగా ఉంచేందుకు గుండెకు పని పెరుగుతుంది. చలి వాతావరణం వల్ల రక్త నాణాలు సంకోచిస్తాయి. దీంతో గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాల సరఫరా తగ్గుతుంది. దీనివల్ల బ్లడ్ ప్రెజర్ అధికమవడం, రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. అందుకే చలికాలంలో గుండె వ్యాధులు, గుండెపోటు రిస్క్ అధికంగా ఉంటుంది.

శ్వాసపరంగానూ..

బ్లడ్ ప్రెజర్ పెరగడం, రక్తం గడ్డకట్టే రిస్కుతో పాటు చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులు కూడా తోడవుతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారికి చలికాలంలో గుండె పోటు రిస్క్ అధికమవుతుంది.

చలికాలంలో చాలా మంది జీవనశైలిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. చల్లటి వాతావరణం ఉండటంతో బద్దకంగా అనిపించి కొందరు వ్యాయామాలు చేసేందుకు ఇష్టపడరు. శారీరక వ్యాయామాలను నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల ఫిట్‍నెస్ తగ్గడమే కాకుండా.. బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా కావొచ్చు. ఇది కూడా గుండెపై ఎఫెక్ట్ చూపుతుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అందుకు తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవాలి. ఉన్ని స్వెటర్లు, మంకీ క్యాప్‍లు లాంటివి వినియోగించాలి. శరీరం వెచ్చగా ఉండే రక్త నాళాలు సంకోచించే రిస్క్ తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉండేందుకు సహకరిస్తాయి. విటమిన్లు, మినరల్స్ ఉండే పోషకాలు ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రైడ్, జంక్ ఆహారాలకు దూరంగా ఉండాలి. చలికాలమైనా నీరు తగినంత తాగాలి. రెగ్యులర్‌గా వ్యాయామం తప్పకుండా చేయాలి. శరీరానికి సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త పడాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచే హెర్బల్ టీలు తీసుకోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానం, యోగా లాంటివి చేయాలి.

Whats_app_banner