Anushka Sharma Dress Price: పెర్త్ టెస్టులో స్టైలిష్ లుక్‍లో సందడి చేసిన అనుష్క శర్మ.. ఆమె డ్రెస్ ధర ఎంతంటే?-anushka sharma cheers for virat kohli in perth test with stylish look know her dress price here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anushka Sharma Dress Price: పెర్త్ టెస్టులో స్టైలిష్ లుక్‍లో సందడి చేసిన అనుష్క శర్మ.. ఆమె డ్రెస్ ధర ఎంతంటే?

Anushka Sharma Dress Price: పెర్త్ టెస్టులో స్టైలిష్ లుక్‍లో సందడి చేసిన అనుష్క శర్మ.. ఆమె డ్రెస్ ధర ఎంతంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 25, 2024 04:30 PM IST

Anushka Sharma Dress Cost: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ హాజరయ్యారు. కోహ్లీ కోసం చీర్ చేశారు. స్టైలిష్ లుక్‍తో కనిపించారు. ఆమె డ్రెస్ ధర ఎంత తెలిసిపోయింది.

Anushka Sharma Dress Price: పెర్త్ టెస్టులో స్టైలిష్ లుక్‍లో సందడి చేసిన అనుష్క శర్మ.. ఆమె డ్రెస్ ధర ఎంతంటే?
Anushka Sharma Dress Price: పెర్త్ టెస్టులో స్టైలిష్ లుక్‍లో సందడి చేసిన అనుష్క శర్మ.. ఆమె డ్రెస్ ధర ఎంతంటే?

భారత స్టార్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటారు. చాలాసార్లు స్టేడియాలకు వచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తూ విరాట్ కోహ్లీ, ఇండియా కోసం చీర్ చేస్తుంటారు. తాజాగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టుకు కూడా అనుష్క శర్మ హాజరయ్యారు. విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడంతో ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ సింపుల్ స్టైలిష్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

కోఆర్డ్ సెట్‍లో అదిరే లుక్

అనుష్క శర్మ ఎక్కువగా స్టైలిష్‍గా, కంఫర్టబుల్‍గా ఉండే ఔట్‍ఫిట్స్ ధరిస్తారు. అందుకే చాలాసార్లు రిలాక్స్డ్ ఫిట్‍తో ఉండే కోఆర్డ్ సెట్స్ ధరిస్తారు. కంఫర్ట్‌గా ఉంటూనే ఫ్యాషన్‍లోనూ ట్రెండీగా కనిపిస్తారు. పెర్త్ టెస్టుకు కూడా కో-ఆర్డ్ సెట్ డ్రెస్ ధరించే హాజరయ్యారు అనుష్క శర్మ. వైట్, బ్లూ స్ట్రిప్స్, ఆరెంజ్ కలర్ ఫ్లోరల్ డిజైన్‍‍తో ఉన్న షర్ట్ ధరించారు. దీనికి కాలర్ నెక్‍లైన్, మోచేతుల వరకు స్లీవ్స్ ఉన్నాయి. దీనికి మ్యాచ్ అయ్యేలా షార్ట్ ధరించారు అనుష్క. సింపుల్‍గానే ఉన్నా స్టైలిష్‍గా ట్రెండీగా ఈ లుక్ అట్రాక్ట్ చేసింది.

ధర ఎంతంటే..

అనుష్క శర్మ డ్రెస్ ధర ఎంతో తెలిసిపోయింది. ధృవ్ కపూర్ బ్రాండ్‍కు చెందినది ఆ డ్రెస్. అనుష్క ధరించిన ఆ షర్ట్ ధర రూ.9,000గా ఉంది. షార్ట్ ధర రూ.6,980గా ఉంది. మొత్తంగా ఈ డ్రెస్ ధర రూ.15,980గా ఉంది. సాధారణంగా సెలెబ్రిటీలు భారీ ధరలతో ఉండే డ్రెస్‍లను ధరిస్తుంటారు. అయితే, అనుష్క వేసుకున్న ఈ డ్రెస్ కాస్త బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంది.

ఈ ట్రెండీ డ్రెస్ ధరించిన అనుష్క శర్మ.. చెవులకు రెండు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు. చేతికి సన్నగా ఉన్న వాచ్ ధరించారు. మేకప్ చాలా మినిమల్‍గా వేసుకున్నారు. తన భర్త విరాట్ కోహ్లీ సెంచరీని స్టాండ్స్‌లో కూర్చొని ఎంజాయ్ చేశారు అనుష్క. నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ కోహ్లీని అభినందించారు.

సినిమాల విషయానికి వస్తే..

అనుష్క శర్మ చివరగా 2018లో జీరో అనే కామెడీ డ్రామా మూవీలో కనిపించారు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత అనుష్క నటించిన ఏ చిత్రం రాలేదు. భారత మాజీ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘ఛక్డా ఎక్స్‌ప్రెస్’ మూవీ చేస్తున్నారు అనుష్క. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్ చిత్రంలో జులన్ పాత్రలో నటిస్తున్నారు అనుష్క. ఈ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, ఇంకా స్ట్రీమింగ్ డేట్ ఖరారు కాలేదు.

కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‍లో 1-0తో ఆధిక్యం సాధించింది.

Whats_app_banner