గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 25, 2024

Hindustan Times
Telugu

గుండె ఆరోగ్యానికి పొటాషియం చాలా కీలకంగా ఉంటుంది. ఈ పోషకం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది. గుండెకు మేలు చేసే పొటాషియం అధికంగా ఉండే 6 ఆహారాలు ఏవంటే.. 

Photo: Pexels

అవకాడోలో పొటాషియం అధికంగా ఉంటుంది. హెల్దీ ప్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గేందుకు సహకరిస్తాయి. దీంతో గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగవుతుంది.

Photo: Pexels

దానిమ్మలోనూ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, కీలకమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ఈ పండు ఇంప్రూవ్ చేస్తుంది.

Photo: Pexels

అరటి పండులోనూ పొటాషియం మెండుగా ఉంటుంది. గుండె పనితీరుకు అరటి మేలు చేస్తుంది. బీపీ కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తుంది.

Photo: Pexels

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాల్లో చిలగడదుంప కూడా ఉంది. దీంట్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరచగలవు. 

Photo: Pexels

పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గించగల లికోపీన్ కూడా ఈ పండులో అధికం. 

Photo: Pexels

గుండె పనితీరుకు కీలకమైన పొటాషియం.. పాలకూరలో అధికంగా ఉంటుంది. కీలకమైన విటమన్లు, ఫైబర్, ఐరన్ కూడా దీంట్లో ఎక్కువే. పాలకూర తింటే బీపీ  నియంత్రణలో ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. 

Photo: Pexels

జుట్టు సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మెంతులను వాడితే చాలా ఫలితాలు ఉంటాయి.

Unsplash