తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala Vaikunta Dwara Darshanam:జనవరి 10 నుంచి 19 వరకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు-ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
Tirumala Vaikunta Dwara Darshanam 2025 : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు అడిషనల్ ఈవో టీటీడీ అధికారులతో సోమవారం సమీక్ష చేశారు.
(1 / 6)
జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు అడిషనల్ ఈవో టీటీడీ అధికారులతో సోమవారం సమీక్ష చేశారు.
(2 / 6)
10 రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఆ పదిరోజుల టికెట్లను టీటీడీ ప్రత్యేకంగా విడుదల చేయనుంది. జనవరి 10వ తేదీ నుంచి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు.
(3 / 6)
వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుఠ ద్వారం ద్వారా ప్రవేశించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఈ 10 రోజుల టికెట్ల కోటాను టీటీడీ ప్రత్యేకంగా విడుదల చేస్తుంది.
(4 / 6)
తిరుమలలోని హెచ్.టి. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
(5 / 6)
భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్.టి.షాపింగ్ కాంప్లెక్స్ వెనుకవైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ భగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఇతర గ్యాలరీలు