యోగా చేయడం వల్ల శరీర ఫిట్‍నెస్ పెరగడంతో పాటు ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. శరీర ఫ్లెక్సిబులిటీ బాగా పెరుగుతుంది. యోగాలో “త్రికోణాసనం” వల్ల చాలా లాభాలు తక్కుతాయి. ఈ ఆసనం రెగ్యులర్‌గా చేస్తే శరీరానికి బెనెఫిట్స్ చాలా లభిస్తాయి. కొన్ని అవయవాల దృఢత్వాన్ని ఈ ఆసనం పెంచగలదు. త్రికోణాసనం వల్ల కలిగే లాభాలు, ఆయన ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
త్రికోణాసనం వల్ల శరీర దిగువ భాగం బలం మెరుగుపడుతుంది. ఆ ఆసనం వేయడం వల్ల ముఖ్యంగా కాళ్ల దృఢత్వం పెరుగుతుంది. తొడ కండరాలపై ఒత్తిడి తెచ్చే ఆ ఆసనం శరీర బ్యాలెన్స్ పెంచుతుంది. కాళ్ల ఫ్లెక్సిబులిటీ అధికంగా చేస్తుంది.
త్రికోణాసనంలో పొత్తి కడుపును తిప్పాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పొత్తి కడుపులోని అవయవాలకు ఇది ప్రేరణ కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడడం, శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేలా ఆ ఆసనం చేయగలదు. కడుపు ఆరోగ్యాన్ని ఆ ఆసనం పెంచగలదు.
త్రికోణాసనం చేసేందుకు స్ట్రైచ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అది భుజాలు, ఛాతికి మేలు చేస్తుంది. ఈ ఆసనం వల్ల వాటి ఫ్లెక్సిబులిటీ పెరుగుతుంది. కండరాలు పట్టేస్తే అవి తగ్గుతాయి. భుజాల బలం అధికం అవుతుంది. మెడకు కూడా ఈ ఆసనం మేలు చేస్తుంది.
త్రికోణాసనంలో నడుమును వంచాల్సి ఉంటుంది. దీనివల్ల వెన్నుకు చాలా మేలు జరుగుతుంది. ఆ ఆసనం వల్ల నడుము నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. కండరాల పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది.
శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడేలా త్రికోణాసనం చేయగలదు. దీంతో అవయవాలకు రక్తం మెరుగ్గా చేరుతుంది. దీంతో వాటి పనితీరు బాగుంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కణాలకు ఆక్సిజన్, రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది.
త్రికోణాసనం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ఆసనం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరం రిలాక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర పట్టేందుకు కూడా ఈ ఆసనం తోడ్పడుతుంది.
టాపిక్