Egg Dal Curry: స్పైసీ శెనగపప్పు ఎగ్ కర్రీ రెసిపీ, ఇలా చేశారంటే ప్రోటీన్స్ పుష్కలంగా అందుతాయి
Egg Dal Curry: కోడిగుడ్డు,శెనగ పప్పు కలిపి వండే వంటకంలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ మేము ఎగ్ దాల్ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ ప్రయత్నించండి.
కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే శనగపప్పు కూడా ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. ఇక్కడ మేము శెనగపప్పు ఎగ్ కర్రీ రెసిపీ ఇచ్చాము. ఒకసారి దీన్ని ప్రయత్నించి చూడండి. ఇది స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. సాధారణంగానే శెనగపప్పును కూరలో వేయడం వల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇక్కడ మేము కోడిగుడ్డు శనగపప్పు కూర ఎలా వండాలో ఇచ్చాము. రెసిపీ ఫాలో అవ్వండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.
శెనగపప్పు కోడిగుడ్డు కూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు - అరకప్పు
గుడ్లు - నాలుగు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - ఐదు
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - అర స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
ధనియాల పొడి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
శెనగపప్పు కోడి గుడ్డు కూర రెసిపీ
1. మీకు పచ్చిశనగపప్పుతో వండడం నచ్చకపోతే పచ్చి బఠానీలను కూడా వేసుకోవచ్చు.
2. కానీ పచ్చిశనగపప్పుతో వండడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది.
3. ముందుగానే శనగపప్పును అరగంట పాటు నానబెట్టుకోవాలి.
4. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో జీలకర్ర వేసి వేయించాలి.
6. తర్వాత ఉల్లిపాయలు తరుగును వేసి బాగా వేయించుకోవాలి.
7. పచ్చిమిర్చి తరుగును కూడా వేయాలి. కరివేపాకులను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఆ మిశ్రమంలోనే అర స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలపాలి.
9. ఇదంతా వేగాక ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసి బాగా కలుపుకోవాలి. పైన మూత పెట్టి ఉడికించుకోవాలి.
10. శెనగపప్పు ఉడకడానికి సరిపడా నీటిని కూడా వేసి వాటిని బాగా ఉడికించాలి.
11. రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.
12. అలాగే ధనియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా వేసి బాగా కలపాలి.
13. ఇది ఇగురు లాగా అయినప్పుడు గుడ్డును పగలగొట్టి పైన వేయాలి. కలపకుండా పైన మూత పెట్టి అలానే ఉంచాలి.
14. కాసేపటికి మూత తీస్తే కోడిగుడ్డు గట్టిగా మారుతుంది. అప్పుడు దాన్ని రెండో వైపుకు తిప్పి అయిదు నిమిషాలు ఉడికించాలి.
15. పైన మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. అంతే టేస్టీ శనగపప్పు ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.
కోడిగుడ్డు మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ప్రతిరోజూ ఒక కోడి గుడ్డును తినమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. ఇందులో పొటాషయం, విటమిన్ ఈ, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. అలాగే మనకు వచ్చే అవసరమైన ప్రోటీన్ నిండుగా ఉంటుంది. శనగపప్పును తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శెనగపప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు పెరగకుండా ఉంటారు. శెనగపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. ఎముకలకు బలాన్ని అందిస్తుంది. శెనగపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా శనగపప్పు ఎంతో ఉపయోగపడుతుంది.
టాపిక్