Diabetes Drink: రెగ్యులర్‌గా ఈ డ్రింక్ ఓ గ్లాస్ తాగండి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది.. తయారీ ఇలా..-diabetes drink cinnamon chia seeds drink will help to blood sugar levels control know how to prepare ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Drink: రెగ్యులర్‌గా ఈ డ్రింక్ ఓ గ్లాస్ తాగండి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది.. తయారీ ఇలా..

Diabetes Drink: రెగ్యులర్‌గా ఈ డ్రింక్ ఓ గ్లాస్ తాగండి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది.. తయారీ ఇలా..

Diabetes Drink: డయాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క, చియా సీడ్లు ఎంతో మేలు చేస్తాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తాయి. ఈ రెండు కలిపిన డ్రింక్ తాగితే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆ వివరాలు ఇవే..

Diabetes Drink: రెగ్యులర్‌గా ఈ డ్రింక్ ఓ గ్లాస్ తాగండి.. షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది.. తయారీ ఇలా.. (Pexel)

డయాబెటిస్ ఉన్న వారు నిరంతరం వారు తీసుకునే ఆహారాలు, పానియాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డైట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేలా చేసే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల సమస్య పెరగకుండా ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు దాల్చినచెక్క, చియా సీడ్స్ కలిపి చేసే డ్రింక్ తాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చెక్కర స్థాయి నియంత్రణలో ఉండేందుకు ఈ రెండూ సహకరిస్తాయి. ఈ దాల్చిన చెక్క చియా సీడ్స్ డ్రింక్ ఎలా చేసుకోవాలో, ఉపయోగాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

తయారీ విధానం

'దాల్చిన చెక్క చియా సీడ్స్ డ్రింక్' చేసుకోవడం సింపుల్. ఇందుకోసం అర టీస్పూన్ దాల్చిన చెక్కపొడి, ఓ టేబుల్‍స్పూన్ చియా సీడ్స్, ఓ కప్పు నీరు, తేనె అవసరం అవుతాయి. ముందుగా ఓ గిన్నెలో నీరు పోసి.. అందులో చియా సీడ్, దాల్చిన చెక్క పొడి వేయాలి. ఆ నీటిని స్టవ్‍పై మరిగించాలి. నీరు మరిగిన తర్వాత గిన్నె దించేసుకోవాలి. సుమారు 10 నిమిషాల పాటు దాన్ని చల్లారనివ్వాలి. ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా అందులో తేనె వేసుకోవాలి. ఆ తర్వాత ఈ డ్రింక్ తాగేయవచ్చు.

బ్లడ్ షుగర్ కంట్రోల్ ఇలా..

చియా గింజల్లో గ్లెసెమిక్ ఇండెక్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో షుగర్‌ను రక్తం శోషించుకోవడాన్ని చియా సీడ్స్ నెమ్మదింప చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడతాయి. ఇన్సులిన్ సెన్సివిటీని దాల్చిన చెక్క మెరుగుపరుస్తుంది. రక్తంలో చెక్కెర స్థాయి అమాంతం పెరగకుండా చేయగలదు.

ఈ రెండు కలిపి చేసే ఈ దాల్చిన చెక్క చియా సీడ్స్ డ్రింక్ డయాబెటిస్‍ ఉన్న వారికి బాగా సూటవుతుంది. రెగ్యులర్‌గా ఓ మోతాదు మేరకు తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‍లో ఉండేందుకు తోడ్పడుతుంది. జీవక్రియను ఈ డ్రింక్ మెరుగుపరుస్తుంది.

గుండె ఆరోగ్యానికి కూడా..

చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు అధికం. దీంతో రెండు కలిపి చేసిన డ్రింక్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదు. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

మరిన్ని లాభాలు

దాల్చిన చెక్క చియాసీడ్స్ డ్రింక్.. బరువు తగ్గేందుకు కూడా సహకరిస్తుంది. చియా సీడ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యేలా దాల్చిన చెక్క చేయగలదు. ఈ డ్రింక్ తాగితే ఆకలి తగ్గుతుంది. దీంతో క్యాలరీలు ఎక్కువ తీసుకోకుండా చేస్తుంది. ఈ డ్రింక్ తాగితే ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థకు కూడా ఈ డ్రింక్ మేలు చేస్తుంది. ఈ డ్రింక్ ఉదయాన్నే తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. శరీరంలో రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుంది. దీంతో చాలా అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. శరీరం చురుగ్గా ఉండేలా ఈ డ్రింక్ చేయగలదు. మెదడుకు కూడా ఈ దాల్చిన చెక్క చీయా సీడ్స్ డ్రింక్ మంచి చేస్తుంది.

గమనిక: డయాబెటిస్ ఉన్న వారు వైద్యులు సూచించిన మందులను వాడుతూనే ఆహార జాగ్రత్తలు పాటించాలి. ఏవైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, సందేహాలు ఎదురైతే వెంటనే సంబంధిత డాక్టర్‌ను సంప్రదించాలి.