Baby Girl Names: మీ ఆడపిల్లకు అందమైన ఈ పేర్లను ఎంపిక చేసుకోండి, ఇవి ఎవరికైనా నచ్చేస్తాయి-choose these cute names for your baby girl that will appeal to anyone ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Girl Names: మీ ఆడపిల్లకు అందమైన ఈ పేర్లను ఎంపిక చేసుకోండి, ఇవి ఎవరికైనా నచ్చేస్తాయి

Baby Girl Names: మీ ఆడపిల్లకు అందమైన ఈ పేర్లను ఎంపిక చేసుకోండి, ఇవి ఎవరికైనా నచ్చేస్తాయి

Haritha Chappa HT Telugu
Nov 25, 2024 09:52 AM IST

Baby Girl Names: మీ పాప కోసం అందమైన పేరు వెతుకుతున్నారా? ఆమెకు ప్రత్యేకమైన, అర్థవంతమైన పేరు కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ మేం కొన్ని పేర్లను సూచించాం. మీకు నచ్చితే ఎంపిక చేసుకోండి.

గర్ల్ బేబీ నేమ్స్
గర్ల్ బేబీ నేమ్స్ (shutterstock)

ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ అందమే వేరు. మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లకు అందమైన పేర్ల కోసం వెతుకుతున్నారా? కొన్ని ప్రత్యేకమైన, అందమైన పేర్లను ఇక్కడ ఇచ్చాము. ఇందులో మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకోండి. ఇవి ఆధునికంగానూ అందంగానూ ఉంటాయి. హిందు బేబీ గర్ల్ పేర్లను ఇక్కడ కొన్ని ఇచ్చాము. ఇవన్నీ కూడా ఎంతో అర్థవంతమైనవి. మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకుని మీ పాపకు నామకరణం చేయండి.

శ్రీనికా

ఈ పేరుకు అర్థం మహావిష్ణువు హృదయంలో ఉన్న లక్ష్మీదేవి అని అర్థం.

లక్ష్మీ దిత్య

ఈ పేరుకు అర్థం మీ ప్రార్థనలకు సమాధానం అని. లక్ష్మీ మాత పేరు ఇది.

మిషిక

దేవుడికి ఎంతో ప్రియమైన వ్యక్తి అని అర్థం. వీరి స్వభావం చాలా మధురంగా ఉంటుంది.

సియరా

ఈ పేరు చాలా ప్రత్యేకమైనది. పూర్తిగా స్వచ్ఛమైన మనసు కల వ్యక్తి అని అర్థం.

జిషా

ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండే వ్యక్తి. వెండి వెన్నెల అని కూడా అర్థం.

కాష్వి

ఈ పేరుకు మెరిసే, ప్రకాశవంతమైన అని అర్థం.

రితాన్యా

ఈ పేరుకు అర్థం దేవత అని.

తక్షవి

ఇదొక ఆధునిక పేరు. దీనికి జీవిత సత్యం అని అర్థం వస్తుంది.

మిరాయా

మీరా శ్రీకృష్ణుని భక్తులు. ఆమె పేరును ఆధునికంగా మార్చి మిరాయా అంటారు.

ఆరవి

ఆ పేరుకు శాంతి అని అర్థం. ప్రశాంతంగా జీవించడం అనే అర్థం కూడా.

రిధి

సంపన్నమైన వ్యక్తి అని దీని అర్థం.

ఇషాని

దుర్గాదేవికి మరో పేరు ఇషాని. ఇది ఎంతో ఆధునిక పేరు.

అధీర

ఆధునికంగా పుట్టిన పేరు ఇది. దీనికర్థం మెరుపులాంటిది అని అర్థం

వన్య

అటవీ సంపదకు సంబంధించిన పదం ఇది. ఎంతో ఆధునికమైనది కూడా.

అభా

రెండక్షరాల అందమైన పేరు ఇశది. దీనికి సంస్కృతంలో కాంతి, శోభ అని అర్థం.

రూహి

ఇది ఆధ్యాత్మిక వ్యక్తిని సూచిస్తుంది. రూహి అంటే ఆత్మ అనే అర్థం ఉంది.

ఉర్వి

ఉర్వి అనే భూమి అని అర్థం. ఈ పేరుకు తెలివైన అనే అర్థం ఉంది.

యానా

ఆధునికమైన పేరు కోసం చూస్తున్నవారు ఈ పేరును ఎంపిక చేసుకోవచ్చు. దీనికర్ధం దేవుని బహుమతి అర్ధం.

జరా

దీనికి అర్థం యువరాణి అని. మీ చిట్టి తల్లి మీ ఇంటి యువరాణి అయితే ఈ పేరుకు పెట్టవచ్చు.

Whats_app_banner