Goa Waterfalls: గోవాలో బీచ్‍లు మాత్రమే కాదు.. ఈ 5 వాటర్‌ఫాల్స్ కూడా మిస్ అవొద్దు.. మనసు దోచేస్తాయి!
Goa Waterfalls: గోవా పరిసరాల్లో అందమైన జలపాతాలు ఉన్నాయి. అక్కడికి వెకేషన్‍కు వెళ్లినప్పుడు బీచ్‍లకే కాకుండా వాటర్ ఫాల్స్‌కు వెళ్లడం మిస్ కాకూడదు. ప్రకృతి అందాలతో ఈ జలపాతాలు మనసులను దోచేస్తాయి.
గోవా అంటే టక్కున గుర్తొచ్చేది అక్కడి బీచ్‍లే. ఇక్కడి సముద్రం తీరం అంతలా పాపులర్ అయింది. అలాగే గోవాలో నైట్‍లైఫ్ కూడా అంతే ఫేమస్ అయింది. గోవాకు దేశ నలుమూలతో పాటు విదేశాల నుంచి కూడా నిత్యం పర్యాటకులు వస్తుంటారు. బీచ్‍ల్లో సంతోషంగా విహరిస్తారు. రాత్రివేళ తళుకుల ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు. అయితే, గోవాలో బీచ్‍లే కాక అందమైన జలపాతాలు (వాటర్ ఫాల్స్) కూడా ఉన్నాయి. గోవా పరిసరాల్లోనే ఇవి ఉన్నాయి.
గోవాకు వెళ్లినప్పుడు వాటర్ ఫాల్స్‌కు తప్పనిసరిగా వెళ్లాలి. జలపాతం, పచ్చదనంతో ఆకట్టుకుంది. ప్రకృతి అందాలు మనసును దోచేస్తాయి. ఇలా గోవాలో ముఖ్యమైన ఐదు వాటర్ ఫాల్స్ ఏవో ఇక్కడ చూడండి.
దూద్‍సాగర్ వాటర్‌ఫాల్స్
గోవా పరిసరాల్లో దూద్‍సాగర్ వాటర్‌ఫాల్స్ ఎంతో అందంగా ఉంటుంది. గోవా-కర్ణాటక సరిహద్దులో ఈ జలపాతం ఉంది. పాలపొంగులా ఉప్పొంగుతున్న నీరు కనిపిస్తుంది. అందుకే దీనికి దూద్‍సాగర్ అనే పేరు వచ్చింది. ఈ వాటర్‌ఫాల్ చుట్టుపక్కల పచ్చదనం అద్భుతంగా ఉంటుంది. గోవాలో తప్పనిసరిగా సందర్శించాల్సిన వాటర్‌ఫాల్ ఇది.
తంబ్డి సుర్లా వాటర్‌ఫాల్స్
భగవాన్ మహవీన్ నేషనల్ పార్కులో ఈ తంబ్డి సుర్లా వాటర్‌ఫాల్ ఉంది. ఇది పూర్తి అడ్వెంచర్ పార్క్. ఈ వాటర్‌ఫాల్‍లో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. చుట్టుపక్కల పచ్చదనం మనసును ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులకు విపరీతంగా నచ్చుతుంది.
మైనాపి వాటర్‌ఫాల్స్
నేత్రవలి అరణ్య ప్రాంతం లోపల మైనాపి వాటర్‌ఫాల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్లేందుకు అడవిలో నడుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అడ్వెంచర్స్ ఇష్టపడే వారికి ఈ వాటర్‌ఫాల్ మంచి ఆప్షన్‍లా ఉంటుంది. దట్టమైన పచ్చదనం, పక్షుల కిలకిలరావాలతో మైనాపి వాటర్‌ఫాల్ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటర్‌ఫాల్ వ్యూ అద్భుతంగా ఉంటుంది.
సవారి వాటర్‌ఫాల్స్
సవారి వాటర్‌ఫాల్స్ కూడా నేత్రవలి సమీపంలోనే ఉంటుంది. రాళ్లపై నుంచి జాలువారే ఈ జలపాతం చూసేందుకు కన్నులకు విందులా ఉంటుంది. అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఆకట్టుకుంటుంది. నీరు కూడా స్వచ్ఛంగానే ఉంటుంది.
అర్వలం వాటర్‌ఫాల్స్
అర్వలం వాటర్‌ఫాల్స్ గోవాలోని కుడ్నే సమీపంలో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ లుక్ అద్భుతంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి అందంతో మనసును ఆకర్షిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. గోవా పరిసరాల్లో మరిన్ని వాటర్‌ఫాల్స్ కూడా ఉన్నాయి.
ఈసారి గోవాకు వెళ్లినప్పుడు బీచ్‍లు, నైట్‍లైఫ్ మాత్రమే కాకుండా వాటర్‌ఫాల్స్‌కు కూడా వెళ్లండి. ఇవేకాక గోవా చుట్టుపక్కల మరిన్ని జలపాతాలు కూడా ఉన్నాయి. అయితే, వేసవిలో కొన్ని చోట్ల నీరు ఎక్కువగా ఉండదు. అందుకే వాటర్‌ఫాల్స్‌లో నీరు ఎలా ఉందో ముందే స్థానికుల వద్ద సమాచారం కనుక్కొని వెళ్లడం మంచిది.