Stocks to buy today : స్టాక్ మార్కెట్లో రివర్సల్! ఈ స్టాక్స్‌తో భారీ లాభాలు..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
చాలా రోజుల తర్వాత.. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1961 పాయింట్లు పెరిగి 79,117 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 557 పాయింట్లు వృద్ధిచెంది 23,907 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 762 పాయింట్లు పెరిగి 51,135 వద్దకు చేరింది.
“మార్కెట్ 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ లేదా నిఫ్టీ 23600, సెన్సెక్స్ 77500 పైన ట్రేడవుతున్నంత వరకు పుల్ బ్యాక్ ఫార్మేషన్ కొనసాగే అవకాశం ఉంది,” అని కోటక్ సెక్యూరిటీస్ వీపీ-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు. నిఫ్టీ 24000-24200 వరకు, సెన్సెక్స్ 79400-79900 వరకు కదలాడవచ్చని అభిప్రాయపడ్డారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1278.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1722.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 40,947.35 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 37,559.08 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ లాభాల్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.97శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.35శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.16శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్- బై రూ. 1898.4, స్టాప్ లాస్ రూ. 1830, టార్గెట్ రూ. 2015
అల్ట్రాటెక్ సిమెంట్- బై రూ. 11375.3, స్టాప్ లాస్ రూ. 10975, టార్గెట్ రూ. 11950
ఔరబిందో ఫార్మా- బై రూ. 1225, స్టాప్ లాస్ రూ. 1204, టార్గెట్ రూ. 1250
జైడస్ లైఫ్‌సైన్సెస్- బై రూ. 950, స్టాప్ లాస్ రూ. 407, టార్గెట్ రూ. 425
కోల్ ఇండియా- బై రూ. 415, స్టాప్ లాస్ రూ. 407, టార్గెట్ రూ. 425
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం