Investment tips : తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్స్! ఈ ‘రిస్క్- ఫ్రీ’ ఇన్వెస్ట్‌మెంట్‌తో భారీ లాభాలు..
SBI Amrit Kalash : ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసి రిస్క్-ఫ్రీగా మంచి రిటర్నులు పొందాలని చూస్తున్నారా? అయితే మీరు ఎస్బీఐ అమృత్ కలష్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్కీమ్ పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఫిక్స్డ్ డిపాజిట్లలో (ఎఫ్డీ) ఇన్వెస్ట్ చేయడం వల్ల నిర్ణీత కాలం తర్వాత కస్టమర్లకు గ్యారెంటీ, దాదాపు రిస్క్-ఫ్రీ ఆదాయం లభిస్తుంది. మీరు కూడా సమీప భవిష్యత్తులో స్వల్పకాలిక పెట్టుబడి పెట్టడం ద్వారా బంపర్ లాభాలను ఆర్జించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న 400 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం గురించి మీరు తెలుసుకోవాల్సిందే! ఇందులో వినియోగదారులు గరిష్టంగా 7.60% వరకు వడ్డీని పొందుతారు. ఈ పాపులర్ స్కీమ్ పేరు ఎస్బీఐ అమృత్ కలష్. ఈ పథకానికి చాలా డిమాండ్ లభిస్తోంది. ఫలితంగా.. ఈ స్కీమ్ గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించింది ఎస్బీఐ.
ఎస్బీఐ అమృత్ కలష్..
2023 ఏప్రిల్ 12న తొలిసారిగా ఎస్బీఐ అమృత్ కలష్ స్కీమ్‌ని ప్రారంభించారు. ఈ సమయంలో, బ్యాంక్ తన గడువును 2023 జూన్ 30 గా నిర్దేశించింది. ఆ తర్వాత దాన్ని 2023 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. పాపులారిటీ దృష్ట్యా బ్యాంక్ ఈ స్కీమ్ గడువును 2024 మార్చి 31 వరకు పొడిగించింది. అయినప్పటికీ, ఈ పథకానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి బ్యాంక్ మరోమారు గడువును సెప్టెంబర్ 30, 2024 వరకు పొడిగించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు కస్టమర్లు 2025 మార్చి 31 వరకు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఎస్బీఐ అమృత్ కలష్ అనేది 400 రోజుల ప్రత్యేక ఎఫ్డీ పథకం. ఇందులో సాధారణ కస్టమర్లు.. పెట్టుబడిపై గరిష్టంగా 7.10% వడ్డీని పొందుతారు. మరోవైపు, సీనియర్ సిటిజన్ కస్టమర్లు ఈ పథకంలో పెట్టుబడి పెడితే 50 బేసిస్ పాయింట్లు అంటే 7.60% వరకు వడ్డీ పొందుతారు. ఈ స్కీమ్ కింద కస్టమర్లు గరిష్టంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు.
ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి కస్టమర్లు తమకు దగ్గరలోని ఏ బ్రాంచుకైనా వెళ్లొచ్చు. దీని కోసం మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్, ఈ0మెయిల్ ఐడీ వంటి డాక్యుమెంట్లు అవసరం. దీని తరువాత, మీరు బ్యాంక్ నుంచి ఈ పథకానికి సంబంధించిన ఒక ఫారం పొందుతారు. దానిని నింపిన తర్వాత మాత్రమే మీ ఖాతా ఓపెన్ అవుతుంది.
సంబంధిత కథనం