Credit card tips : మీ లైఫ్‌స్టైల్‌కి ఎలాంటి క్రెడిట్ కార్డు సూట్ అవుతుంది? ఇది తెలియకపోతే నష్టపోతారు..
Best credit card for beginners : మీ లైఫ్‌స్టైల్‌కి ఎలాంటి క్రెడిట్ కార్డు సూట్ అవుతుంది? అసలు క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మీరు కొత్తగా ఒక క్రెడిట్ కార్డు తీసుకోవాలని చూస్తున్నారా? తొందరపడి ఏదో ఒకటి తీసేసుకుంటే.. మీకే నష్టం! మరి మీ లైఫ్‌స్టైల్‌కి ఎలాంటి క్రెడిట్ కార్డు సూట్ అవుతుంది? ఒక క్రెడిట్ కార్డు తీసుకునే ముందు ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇవి తెలుసుకునే క్రెడిట్ కార్డు తీసుకోండి..
1. రివార్డు పాయింట్లు: చాలా క్రెడిట్ కార్డులు ప్రతి కొనుగోలుకు రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. హోటల్ లేదా ఫ్లైట్ బుకింగ్స్ చేయడానికి ఈ పాయింట్లను ఉపయోగించవచ్చు. కొన్ని కార్డులు కార్డుదారులకు ఈ రివార్డు పాయింట్లతో క్యాష్‌బ్యాక్‌ని కూడా అందిస్తాయి.
ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డు కార్డుపై ఖర్చు చేసే ప్రతి 100 రూపాయల మీద 2 రివార్డ్ పాయింట్లు వస్తాయి. (ఇంధనం మినహా). యుటిలిటీస్, ఇన్సూరెన్స్ కేటగిరీలపై ఖర్చు చేసే ప్రతి రూ.100పై 1 రివార్డ్ పాయింట్ పొందొచ్చు.
2. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్: చాలా క్రెడిట్ కార్డులు దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్‌లకు యాక్సెస్ ఇస్తాయి. కార్డు ఎంత ఉన్నతంగా ఉంటే, ఈ లాంజ్‌లకు యాక్సెస్ అంత విస్తృతంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని కార్డులు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లకు మాత్రమే యాక్సెస్ ఇస్తుండగా, మరికొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కూడా యాక్సెస్ ఇస్తాయి. అదనంగా, సుపీరియర్ కార్డులు ఈ లాంజ్‌లకు మరింత తరచుగా యాక్సెసబిలిటీని ఇస్తాయి.
ఉదాహరణకు.. పేటీఎం ఎస్బిఐ కార్డ్ సెలెక్ట్ కార్డ్‌తో కార్డుదారులకు ఒక సంవత్సరంలో నాలుగు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్‌లను యాక్సెస్ చేయడానికి వీలవుతుంది (ప్రతి త్రైమాసికంలో ఒకటి). యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు కార్డుదారులకు అపరిమిత లాంజ్ యాక్సెస్‌ని అందిస్తుంది.
3. డైనింగ్‌పై డిస్కౌంట్: కొన్ని కార్డులు పలు రెస్టారెంట్లలో డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. కాబట్టి, మీరు ఆహార ప్రియులైతే, చాలా తినడానికి ఇష్టపడితే, ఇది మీకు అనుకూలంగా పనిచేస్తుంది! ఉదాహరణకు.. యాక్సిస్ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు స్విగ్గీపై 30 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ని అందిస్తుంది.
4. ఆన్లైన్ షాపింగ్ డిస్కౌంట్: క్రెడిట్ కార్డులు ఆన్లైన్ మార్కెట్ ప్రదేశాల్లో లేదా కిరాణా, ట్రావెల్ బుకింగ్స్ వంటి వాటిపై షాపింగ్ డిస్కౌంట్ని కూడా అందిస్తాయి.
5. సినిమా టికెట్లు: కొన్ని ప్రత్యేక క్రెడిట్ కార్డులు కాంప్లిమెంటరీ మూవీ టికెట్లను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో, ఒకటి కొనుగోలుతో అదనంగా ఒక టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఉదాహరణకు.. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డు నెలకు రెండుసార్లు బుక్ మై షో, ఐనాక్స్‌లో సినిమా టిక్కెట్లపై 25 శాతం తగ్గింపును అందిస్తుంది!
6. ఈవెంట్లకు ఉచిత పాస్‌లు: కొన్ని సందర్భాల్లో, క్రెడిట్ కార్డులు కాన్సర్ట్స్, మ్యూజిక్ నైట్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాలకు ఉచిత పాస్‌లను అందిస్తాయి.
7. వార్షిక రుసుము: క్రెడిట్ కార్డులు వార్షిక రుసుమును వసూలు చేస్తాయి. ఫీజు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది! ఏదేమైనా, ప్రయోజనాలు, డిస్కౌంట్లు వార్షిక రుసుము కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. కొన్ని సందర్భాల్లో అధిక రుసుము చెల్లించడం విలువైనది.
8. ఎయిర్ మైల్స్: మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు, మీరు కొన్ని రివార్డ్ పాయింట్లను పొందుతారు. కాలక్రమేణా ఈ పాయింట్లను సేకరించిన తర్వాత, మీరు వాటిని ఎయిర్ మైల్స్ కొనుగోలుగా మార్చవచ్చు. ఈ ఎయిర్ మైల్స్‌ని విమాన టికెట్లు కొనడానికి ఉపయోగించవచ్చు.
కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్లను అందించే కొన్ని క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఉదాహరణకు.. యాక్సిస్ బ్యాంక్ విస్తారా క్రెడిట్ కార్డును అందిస్తుంది! ఇది ఒక కాంప్లిమెంటరీ ఎకానమీ క్లాస్ టికెట్‌ని వెల్కమ్ బెనిఫిట్‌గా అందిస్తుంది. ఏడాదికి 3 ఎకానమీ క్లాస్ టికెట్లు కూడా సంపాదించవచ్చు.
దాదాపు అన్ని క్రెడిట్ కార్డులు ఒకే రకమైన వడ్డీ రేటును వసూలు చేస్తాయి. ఇది ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై వసూలు చేసే వడ్డీ రేట్లను పోల్చడం క్రెడిట్ కార్డును ఎంచుకోవడానికి మీకు సహాయపడదు.
అదనంగా, దాదాపు ప్రతి క్రెడిట్ కార్డు 45 రోజుల వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని అందిస్తుంది. ఈ కోణం నుంచి కూడా మాట్లాడటానికి పెద్దగా తేడా లేదు. కాబట్టి, మీకు ఏ క్రెడిట్ కార్డు మంచిదో నిర్ణయించుకునే ముందు పైన చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. మీరు వేటిని ఎక్కువగా వాడతారో, వాటిపై అధిక బెనిఫిట్స్ లభించే కార్డులను తీసుకోవడం ఉత్తమం!
సంబంధిత కథనం