Best family car : ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ ఇదే- ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది!
ఫ్యామిలీకి సెట్ అయ్యే విధంగా ఒక మంచి 7 సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఇన్నోవా హైక్రాస్ కొత్త మైలురాయిని దాటింది. ఆ వివరాలు..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్‌గా కొనసాగుతోంది టయోటా ఇన్నోవా హైక్రాస్! ఇక ఇప్పుడు ఈ మోడల్‌కి సంబంధించి క్రేజీ అప్డేట్ని ఇచ్చింది సంస్థ. నవంబర్ 2022లో లాంచ్ అయిన ఈ పాప్యులర్ ఎంపీవీ.. తాజాగా 1 లక్ష సేల్స్ మైలురాయిని చేరుకుందని సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ కారు ఇదే..
టయోటా ఇన్నోవా క్రిస్టా ఆధారంగా రూపొందించిన ఈ ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీ కాస్త ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇన్నోవా హైక్రాస్ ఇన్నోవా క్రిస్టాకి ప్రీమియం వర్షెన్ అని చెప్పుకోవాలి. ఈ మోడల్ ధర రూ .19.77 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ .30.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్-ఓన్లీ, పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఏడు, ఎనిమిది సీట్ల ఆప్షన్స్‌లో లభించే ఈ ఎంపీవీ.. వినియోగదారులకు ఏడు వేర్వేరు కలర్ ఎంపికలను కూడా అందిస్తుంది! అవి.. బ్లాక్ ఐష్ అఘా గ్లాస్ ఫ్లేక్, సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, స్పార్క్లింగ్ బ్లాక్ పెర్ల్ క్రిస్టల్ షైన్, అవంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్.
టయోటా ఇన్నోవా హైక్రాస్కి అధిక డిమాండ్ ఉందని, దీని ఫలితంగా ఎంపీవీ ఎనిమిది నెలల వరకు సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉందని సంస్థ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఎంపీవీ మొదటిసారి భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు దీని వెయిటింగ్ పీరియడ్ రెండు సంవత్సరాల వరకు వెళ్లింది!
ఈ ఎంపీవీ టాప్-స్పెక్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ).. ఇన్నోవా హైక్రాస్ మొత్తం అమ్మకాలలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉండటం విశేషం. వాస్తవానికి, ఇంత అధిక డిమాండ్ కారణంగా, టాప్-స్పెక్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) వేరియంట్ల బుకింగ్లను గతంలో చాలాసార్లు నిలిపివేశారు కూడా!
ఇందులోని 2.0-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 172బీహెచ్పీ పవర్, 188ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో, 2.0-లీటర్ పెట్రోల్ మోటారును ఎలక్ట్రిక్ మోటార్‌తో కలిపే హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 206 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఎంపీవీ కోసం ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో సీవీటీ, ఈ-సీవీటీ యూనిట్ ఉన్నాయి.
7 సీటర్, 8 సీటర్ ఆప్షన్స్ ఉండటంతో ఇండియాలో ఫ్యామిలీస్‌కి సరిగ్గా సూట్ అయ్యే ఎంపీవీగా ఇన్నోవా హైక్రాస్ నిలిచింది. అందుకే దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది.
సంబంధిత కథనం