Fixed Deposit : ఎస్బీఐలో ఈ సూపర్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.. మంచి రాబడులు
Fixed Deposit Interest Rates : పెట్టుబడి పెట్టేందుకు ఎఫ్‌డీలు సురక్షితమైనవి. మంచి లాభాలను పొందుతారు. మంచి పెట్టుబడుల ద్వారా అధిక ఆర్థిక లాభం పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఎస్బీఐ అమృత్ వృష్టి ఎఫ్‌డీ బెటర్.
పెట్టుబడితో పాటు గ్యారెంటీ రిటర్న్ ఉంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. నిజానికి ఎఫ్‌డీ పెట్టుబడులు సురక్షితమైనవి, రిస్క్ లేనివి. మీ ఆసక్తిని బట్టి మీరు వ్యవధిని నిర్ణయించుకోవచ్చు. అలా మీరు కూడా ప్లాన్ చేస్తుంటే.. ఎస్బీఐ అమృత్ వృష్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ మంచి ఆప్షన్. హామీతో కూడిన అధిక రాబడిని పొందవచ్చు. ఇతర ఎఫ్‌డీలతో పోలిస్తే ఇందులో లాభం ఉంటుంది.
అమృత్ వృష్టి ఎఫ్‌డీ అనేది ఎస్బీఐ కస్టమర్లు అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్. ఈ పెట్టుబడి కాలవ్యవధి 444 రోజులు, హామీతో కూడిన రాబడిని అందిస్తోంది. సాధారణ పౌరులు 444 రోజులకు సంవత్సరానికి 7.25 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పెట్టుబడిపై రుణ సౌకర్యం కూడా ఉంటుంది. ఎస్బీఐ హామీ ఇచ్చే ఈ పథకంలో మీరు కనీస డిపాజిట్ రూ.1000తో ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ ప్రాజెక్ట్ 15 జూలై 2024న ప్రారంభించారు. ఈ పథకంలో చేరేందుకు 31 మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ఊహించని ఆర్థిక అవసరాలతో మెచ్యూరిటీకి ముందు డిపాజిట్ విత్‌డ్రా చేస్తే బ్యాంక్ పెనాల్టీని వసూలు చేస్తుంది. 5 లక్షల వరకు డిపాజిట్లపై 0.50 శాతం జరిమానా విధిస్తారు. మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేసుకుంటే రూ.5 లక్షల కంటే ఎక్కువ, రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లు 1 శాతం పెనాల్టీ ఉంటుంది.
444 రోజులకు 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో మీకు ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం.. ఎస్‌బీఐ అమృత్ వృష్టి ఎఫ్‌డీలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే 7.75 శాతంపై రూ.19,859 వడ్డీని పొందవచ్చు. ఎఫ్‌డీ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మొత్తం మొత్తంగా 2,19,859 అందుకుంటారు. సాధారణ పౌరులకు 7.25 శాతం రేటుతో 18,532 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.2,18,532 అందుతుంది.
2.5 లక్షలతో సీనియర్ సిటిజన్లు 444 రోజుల వడ్డీని రూ. 24,824 పొందవచ్చు. రూ.2,74,824 మెచ్యూరిటీ తర్వాత అందుకుంటారు. సాధారణ పౌరులకు 444 రోజుల డిపాజిట్‌కు రూ.23,165 వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తం రూ.2,73,165 అవుతుంది.
3 లక్షలు పెట్టుబడి పెడితే సీనియర్ సిటిజన్లు రూ.3 లక్షల పెట్టుబడిపై రూ.29,789 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మొత్తం రూ.23,29,789 అందుతుంది. సాధారణ పౌరులకు 444 రోజులకు 27,798 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.3,27,798 అందుకుంటారు.
444 రోజుల కాలవ్యవధికి 3.5 లక్షలు పెట్టిన సీనియర్ సిటిజన్లు రూ. 34,753 వడ్డీని పొందుతారు. మెచ్యూరిటీపై మొత్తం రూ. 3,84,753 వస్తుంది. సాధారణ పౌరులు వడ్డీ రూపంలో రూ. 32,431, మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 3,82,431 అందుకుంటారు.
4 లక్షలు 444 రోజుల పాటు పెట్టుబడి పెడితే.. సీనియర్ సిటిజన్లకు రూ. 39,718 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.4,39,718 పొందుతారు. సాధారణ పౌరులు అదే సమయంలో రూ. 37,064 వడ్డీని పొందవచ్చు. పూర్తయిన తర్వాత మొత్తం రూ.4,37,064 అందుతుంది.