Trivikram: డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో చియాన్ విక్రమ్ కాంబోలో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే!
Trivikram: టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కాంబోలో రెండు తెలుగు సినిమాలు వచ్చాయి. కెరీర్ ఆరంభంలో విక్రమ్ హీరోగా నటించిన మెరుపు, అక్కా బాగున్నావా సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేయడం గమనార్హం.
కోలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు చియాన్ విక్రమ్. జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన ప్రయోగాత్మక సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఆ వైవిధ్యతే విక్రమ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.
తెలుగు సినిమాలతోనే...
హీరోగా విక్రమ్ కెరీర్ మాత్రం తెలుగు సినిమాలతోనే మొదలైంది. కెరీర్ ఆరంభంలో తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విక్రమ్ కనిపించాడు. అక్కపెత్తనం చెల్లెలి కాపురం, బంగారు కుటుంబం, ఊహ, అక్కా బాగున్నావా, మెరుపుతో పాటు పలు తెలుగు సినిమాల్లో విక్రమ్ విభిన్నమైన పాత్రలు చేశాడు.
త్రివిక్రమ్ ఘోస్ట్ రైటర్...
విక్రమ్ నటించిన ఈ సినిమాల్లో మెరుపు, అక్కాబాగున్నావా సినిమాలకు ఇప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఘోస్ట్ రైటర్‌గా పనిచేయడం గమనార్హం. సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చిన త్రివిక్రమ్ ప్రముఖ నవల రచయిత కొమ్మనాపల్లి గణపతిరావు సహాయంతో మెరుపు సినిమాకు అసిస్టెంట్ రైటర్‌గా కొద్ది రోజుల పాటు పనిచేశారు.
ఆ తర్వాత విక్రమ్ హీరోగా నటించిన మరో మూవీ అక్కా బాగున్నావా సినిమా క్లైమాక్స్ సీన్స్ తివిక్రమ్ రాశారు. క్లైమాక్స్ అసంపూర్ణంగా అనిపించడంతో దర్శకుడు మౌళి త్రివిక్రమ్ సహాయం తీసుకున్నారాట. కథకు తగ్గట్లుగా అర్థవంతమైన క్లైమాక్స్‌ను రాసి దర్శకుడితో పాటు రైటర్ పోసాని కృష్ణమురళిని మెప్పించాడటం త్రివిక్రమ్.
పోసాని కృష్ణమురళి...
ఈ సినిమా టైమ్‌లోనే పోసాని కృష్ణమురళితో ఏర్పడిన పరిచయం త్రివిక్రమ్ సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. పోసాని వద్ద పలు సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ రైటర్‌గా, అసోసియేట్ రైటర్‌గా త్రివిక్రమ్ పనిచేశాడు. స్వయంవరం మూవీతో రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.
సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, చిరునవ్వుతో పాటు పలు సినిమాలకు స్టోరీ రైటర్‌గా డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. తరుణ్, శ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన నువ్వే నువ్వేతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
గుంటూరు కారం...
ఈ ఏడాది గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు త్రివిక్రమ్. మహేష్‌బాబు హీరోగా నటించిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ పీరియాడికల్ మూవీ చేయబోతున్నాడు. మరోవైపు తంగలాన్‌తో విక్రమ్ మిక్స్‌డ్ రిజల్ట్‌ను సొంతం చేసుకున్నడు. అతడి నటనకు ప్రశంసలు దక్కిన కమర్షియల్‌గా మాత్రం సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ప్రస్తుతం దానవీర శూరన్ పేరుతో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తోన్నాడు విక్రమ్.