Spinach Egg Curry Recipe: సులువుగా, టేస్టీగా పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలంటే.. రుచితో పాటు పోషకాలు కూడా..-how to make palak egg curry simple and tasty check this recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spinach Egg Curry Recipe: సులువుగా, టేస్టీగా పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలంటే.. రుచితో పాటు పోషకాలు కూడా..

Spinach Egg Curry Recipe: సులువుగా, టేస్టీగా పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలంటే.. రుచితో పాటు పోషకాలు కూడా..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2024 03:30 PM IST

Spinach (Palak) Egg Curry Recipe: పాలక్ ఎగ్ కర్రీని సింపుల్‍గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అన్నం, చపాతీల్లోకి బాగా సూటవుతుంది. ఈ కర్రీ ఎలా చేయాలంటే..

Spinach Egg Curry Recipe: సులువుగా, టేస్టీగా పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలంటే.. రుచితో పాటు పోషకాలు కూడా..
Spinach Egg Curry Recipe: సులువుగా, టేస్టీగా పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలంటే.. రుచితో పాటు పోషకాలు కూడా..

కోడిగుడ్డుతో రకరకాల కర్రీలు చేయవచ్చు. పోషకాలు మెండుగా ఉండే గుడ్లను ప్రతీ రోజు తినడం ముఖ్యం. అందుకే బోర్ కొట్టకుండా రోజుకు ఓ తీరులో గుడ్లతో కర్రీలు చేసుకుంటే ఇంట్రెస్టింగ్‍గా తినొచ్చు. కొత్త రుచులను కూడా చూడొచ్చు. గుడ్లతో చాలా రకాల కర్రీలను సులభంగా చేసుకోవచ్చు. అలాంటిదే ‘పాలక్ ఎగ్ కర్రీ’. ఉడికించిన గుడ్లు, పాలకూరతో చేసే ఈ కర్రీ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చేయడం కూడా సింపులే. మరి ఈ పాలక్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

పాలక్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు

  • 3 కోడిగుడ్లు (ఉడికించుకోవాలి)
  • పాలకూర (సుమారు 130 గ్రాములు)
  • రెండు టమాటాలు (తరగాలి)
  • ఓ ఉల్లిపాయ
  • రెండు ఇంచుల అల్లం తరుగు
  • మూడు పచ్చిమిర్చి
  • 6 వెల్లిల్లు రెబ్బలు
  • ఓ దాల్చిన చెక్క
  • టేబుల్ స్పూన్ కారం పొడి
  • అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి
  • టేబుల్ స్పూన్ జీలకర్ర
  • రుచికి సరిపడా ఉప్పు
  • అర టేబుల్ స్పూన్ గరం మసాలా
  • చిటికెడు పసుపు
  • కాస్త కొత్తిమీర

పాలక్ ఎగ్ కర్రీ చేసుకునే విధానం

  • ముందుగా కోడిగుడ్లను సాఫ్ట్‌గా ఉడికించుకోవాలి. సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • పాలకూరను శుభ్రంగా నీటితో కడగాలి. అనంతరం ప్యాన్‍లో నీరు వేసి పాలకూరను బాగా ఉడికించుకోవాలి. నీటిలో పాలకూర మునిగే వరకు ఉడికించాలి.
  • ఉడికించిన పాలకూరను ఓ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, అల్లం తరుగు, ధనియాల పొడి వేసి మెత్తగా పేస్ట్‌లా బ్లెండ్ చేసుకోవాలి. ఆ పాలకూర ప్యూరీని పక్కనపెట్టుకోవాలి.
  • స్టవ్‍పై ఓ ప్యాన్ పెట్టి ముందుగా నూనె వేయాలి. దాంట్లో జీలకర్ర, దాల్చిన చెక్క, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేపాలి. ఆ తర్వాత దాంట్లో తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మగ్గాక దాంట్లో తరిగిన టమాటాలు వేసుకోవాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు వేచిచూడాలి.
  • టమాటాలు మెత్తబడ్డాక అందులో తయారు చేసుకున్న పాలకూర పేస్ట్ వేయాలి. దాంట్లోనే ఉప్పు, కారం పొడి, పసుపు, గరం మసాలా వేయాలి.
  • పాలకూర మిశ్రమాన్ని  మీడియం మంటపై సుమారు 5 నిమిషాలు ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత కట్ చేసుకున్న ఉడికిన కోడిగుడ్ల ముక్కలను పాలక్ కర్రీలో వేయాలి.
  • మంటను సిమ్‍లో పెట్టి ఓ మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివర్లో కాస్త కొత్తిమీర వేసుకోని దింపేసుకోవాలి. అంతే.. పాలక్ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది.

అన్నం, చపాతీలతో తినేందుకు పాలక్ ఎగ్ కర్రీ బాగా సూటవుతుంది. వెయిట్ లాస్ డైట్‍లో ఉన్న వారు కూడా ఈ కర్రీని తినొచ్చు. ఎప్పుడైనా త్వరగా కర్రీ చేసుకోవాలంటే కూడా ఇది బాగుంటుంది.

పాలకూర, కోడిగుడ్లలో కీలకమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు సహా చాలా పోషకాలు ఉంటాయి. పూర్తిస్థాయి ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పాలక్ ఎగ్ కర్రీ బాగా సూటవుతుంది. గుండె, కళ్ల ఆరోగ్యానికి ఈ కర్రీ మంచి చేస్తుంది. పాలకూర, కోడిగుడ్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తాయి. ఎముకల దృఢత్వాన్ని పెంచగలవు.

Whats_app_banner