తెలుగు న్యూస్ / ఫోటో /
మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల వారి అదృష్టం మారనుంది.. మరింత సంపద, సంతోషం దక్కుతాయి!
- గురువు అతిత్వరలో నక్షత్రం మారనున్నాడు. ఈ వారంలోనే రోహిణి నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం సానుకూలంగా మారి.. ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
- గురువు అతిత్వరలో నక్షత్రం మారనున్నాడు. ఈ వారంలోనే రోహిణి నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారి అదృష్టం సానుకూలంగా మారి.. ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, జ్ఞానం, సంపద, విద్య, వివాహం, సంతోషాలకు గురువు (బృహస్పతి) కారకుడిగా ఉన్నాడు. అందుకే గురువు సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. రాశులపై ప్రభావం అధికంగా ఉంటుంది.
(2 / 5)
గురువు ప్రస్తుతం మార్గశిర నక్షత్రంలో ఉండగా అతిత్వరలో నక్షత్రం మారనున్నాడు. మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 28వ తేదీన రోహిణి నక్షత్రంలోకి గురువు ప్రవేశించనున్నాడు. 2025 ఏప్రిల్ 10 వరకు రోహిణి నక్షత్రంలోనే ఉంటాడు. ఈ కాలంలో గురువు వల్ల కొన్ని రాశుల వారికి లాభాలు దక్కుతాయి. ఆ రాశులు ఏవంటే..
(3 / 5)
మేషం: ఈ కాలంలో మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. శుభ ఫలితాలు దక్కుతాయి. వ్యాపారులకు సంపద విషయంలో అనుకూలిస్తుంది. లాభాలు పెరుగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఏవైనా గొడవలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి. సంతోషం నెలకొంటుంది.
(4 / 5)
కుంభం: ఈ కాలంలో కుంభరాశి వారికి అదృష్టం బాగుంటుంది. అసంపూర్ణంగా ఉన్న కొన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. వ్యాపారులకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగులకు కూడా సానుకూలంగా ఉంటుంది.
(5 / 5)
తుల: రోహిణి నక్షత్రంలో గురువు సంచరిస్తున్న కాలం తులా రాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఈ కాలంలో వీరు డబ్బు ఎక్కువగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు పెరగొచ్చు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగుంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం ఇచ్చాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి)
ఇతర గ్యాలరీలు