Moringa Sesame Powder Recipe: శరీరంలో రక్తాన్ని పెంచగల మునగాకు నువ్వుల పొడి.. తయారీ ఇలా.. పుష్కలంగా ఐరన్-moringa sesame powder recipe recipe making process this iron rich dish can increase blood in body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moringa Sesame Powder Recipe: శరీరంలో రక్తాన్ని పెంచగల మునగాకు నువ్వుల పొడి.. తయారీ ఇలా.. పుష్కలంగా ఐరన్

Moringa Sesame Powder Recipe: శరీరంలో రక్తాన్ని పెంచగల మునగాకు నువ్వుల పొడి.. తయారీ ఇలా.. పుష్కలంగా ఐరన్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 24, 2024 01:45 PM IST

Moringa Sesame Powder Recipe: మునగాకు, నువ్వులతో తయారు చేసే ఈ పొడిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యను తగ్గించగలదు. దీన్ని ప్రతీ రోజు తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి మెరుగ్గా ఉంటుంది. ఈ పొడిని ఎలా చేసుకోవాలంటే..

Moringa Sesame Powder: శరీరంలో రక్తాన్ని పెంచగల మునగాకు, నువ్వుల పొడి.. తయారీ ఇలా.. పుష్కలంగా ఐరన్
Moringa Sesame Powder: శరీరంలో రక్తాన్ని పెంచగల మునగాకు, నువ్వుల పొడి.. తయారీ ఇలా.. పుష్కలంగా ఐరన్ (pixabay)

శరీరంలో రక్తం ఉత్పత్తి మెరుగ్గా ఉండాలంటే ఐరన్ చాలా ముఖ్యమైన పోషకం. ఐరన్ లోపం ఏర్పడితే రక్తహీనత సమస్య తలెత్తుతుంది. దీని ద్వారా చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. ఐరన్ లోపంతో రక్తహీనత వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అలాంటి కీలకమైన ఐరన్.. మునగాకు, నువ్వుల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కలిపి చేసే పొడి.. శరీరంలో రక్తం పెరిగేందుకు తోడ్పడుతుంది. ఈ ‘మునగాకు నువ్వుల పొడి’ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మునగాకు నువ్వుల పొడికి కావాల్సిన పదార్థాలు

  • అరకప్పు మునగాకు (అరబెట్టాలి)
  • అరకప్పు నువ్వులు
  • పావు కప్పు మినపప్పు
  • 10 ఎండు మిర్చిలు (మిర్చిల కారాన్ని బట్టి)
  • 6 అల్లం ముక్కలు (సన్నగా తరగాలి)
  • ఓ టేబుల్‍స్పూన్ ధనియాలు
  • ఓ టేబుల్‍స్పూన్ ఆమ్‍చూర్ పొడి
  • రెండు టీస్పూన్‍ల నూనె
  • ఓ టేబుల్‍స్పూన్ జీలకర్ర
  • ఓ రెండు రెబ్బల కరివేపాకు
  • తగినంత ఉప్పు

మునగాకు నువ్వుల పొడి తయారీ విధానం

  • ముందుగా మునగాకును ఆరబెట్టుకోవాలి. తేమ ఆరిపోయే వరకు ఎండబెట్టాలి.
  • అడుగు మందంగా ఉండే ఓ కళాయిలో ముందుగా నువ్వులు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి వేపుకోవాలి. మంటను తక్కువగా పెట్టి బాగా వేపుకోవాలి. ఎక్కువ మంట ఉంటే లోపల పప్పు సరిగా వేగదు. అందుకే టైమ్ పట్టినా తక్కువ మంటపైనే వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత వేగిన వీటిని ఓ ప్లేట్‍లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత కళాయిలో ఎండిన మునగాకును వేయించుకోవాలి. అందులోనే ఆమ్‍చూర్ పౌడర్ వేయాలి. ఓ నిమిషం పాటు మునగాకును ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఓ కళాయిలో ఓ టీస్పూన్ నూనెను వేసుకొని వేడయ్యాక తరిగిన అల్లం ముక్కలు వేయించుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి.
  • అందులోనే మరో టీస్పూన్ నూనె పోసుకోవాలి. అందులో ఎండుమిర్చిని వేసి వేపుకోవాలి. కాస్త రంగు మారగానే తీసేసుకోవాలి.
  • వేయించుకున్నవి అన్నీ చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి.
  • ఆ తర్వాత వేయించుకున్న నువ్వులు, మినప్పప్పు సహా మిగిలినవి, మునగాకు, ఎండుమిర్చి అన్నీ మిక్సీజార్‌లో వేయాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. అన్నింటినీ మిక్సీలో పొడిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉంటే తినేందుకు రుచి ఇంకా బాగుంటుంది. అంతే మునగాకు నువ్వుల పొడి రెడీ అవుతుంది.

ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెల వరకు కూడా మునగాకు నువ్వుల పొడి తాజాగా ఉంటుంది. అన్నం, దోశలు, చపాతీలు, రొట్టెలతో ఈ పొడిని తినొచ్చు. ఇది రెగ్యులర్ తింటే శరీరంలో రక్తం పెరిగేలా ఇందులోని ఐరన్ తోడ్పడుతుంది.

Whats_app_banner